Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Margi 2022 Date: శని మార్గం... అక్టోబర్ 23 నుండి ఈ రాశులవారిపై డబ్బు వర్షం!

Shani Margi 2022 Date: శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. అక్టోబరు 23 నుంచి అతని నడకలో మార్పు వస్తుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట  రాశులేంటో తెలుసుకుందాం.  
 

Shani Margi 2022 Date: శని మార్గం... అక్టోబర్ 23 నుండి ఈ రాశులవారిపై డబ్బు వర్షం!

Shani Margi 2022 Date: మనం చేసే మంచి, చెడు పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని ఆగ్రహానికి ఎవరు గురవుతారో వారి జీవితం నాశనమవడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు.  అక్టోబరు 23న శని సంచారంలోకి వస్తాడు. శని మార్గి (Shani Margi 2022) మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

మేషం (Aries): శని మార్గం వల్ల ఈ రాశివారు చాలా ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వారు భారీగా లాభాలను గడిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ వృత్తిలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 

కర్కాటక రాశి (Cancer): శని కర్కాటక రాశి యెుక్క ఏడవ ఇంట్లో  సంచరిస్తాడు. దీంతో ఈ రాశి వారి సమస్యలన్నీ తీరిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ నుండి పుల్ సపోర్టు మీకు లభిస్తుంది. 

తులా రాశి (Libra): అక్టోబరు 23 నుండి ఈ రాశివారు బంపర్ ప్రయోజనాలను పొందనున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి యెుక్క నాల్గో ఇంటి శని సంచారం జరుగుతుంది కాబ్టటి వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.  

వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి శని మార్గంలో ఉండటం వల్ల చాలా మేలు జరుగుతుంది.  ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. మీరు ఏదైనా కొత్త పని చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇదే మంచి సమయం. 

మీనరాశి (Pisces): శని సంచారం ఈరాశి వారికి లాభాలను  తెచ్చిపెడుతుంది. వీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు లాభపడతారు. మెుత్తం మీద ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: కన్యారాశిలోకి సూర్యుడు... సెప్టెంబర్ 17 నుండి ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More