Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Gochar 2023: అరుదైన యోగం చేసిన శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani Gochar 2023: శనిదేవుడు కుంభరాశిలో ఉదయించడం వల్ల శష్ మహాపురుష రాజయోగం చేశాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Shani Gochar 2023: అరుదైన యోగం చేసిన శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani Gochar 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభం శని యొక్క త్రికోణ చిహ్నంగా భావిస్తారు. శని కుంభరాశి ప్రవేశం చేయడం వల్ల శష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం మార్చి 09 నుండి ప్రారంభమైంది. ఆస్ట్రాలజీలో ఈ రాజయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శష్ మహాపురుష రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం. 

శష్ మహాపురుష రాజయోగం ఈ రాశులకు వరం
మేషం (Aries): శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మీ జాతకంలో పదకొండవ స్థానంలో శని ఉదయించడం వల్ల మేషరాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతితో పాటు ధనలాభం కూడా పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
సింహం (Leo): కుంభరాశిలో శని దేవుడి ప్రవేశంతో సింహ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. శష మహాపురుష రాజయోగం ఈరాశి యెుక్క సప్తమంలో ఏర్పడుతోంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ త్వరలో పూర్తవుతాయి. 
కుంభ రాశి (Aquarius): శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉదయించడం వల్ల శష్ మహాపురుష రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం కుంభ రాశి వారి లగ్న గృహంలో ఏర్పడబోతోంది. మీకు మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. జీవితంలో పురోగతి లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

Also Read: Navpancham Yog 2023: 30 ఏళ్ల తర్వాత 'ట్రిపుల్ నవపంచం యోగం'... ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More