Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత శని ఆ రాశిలోకి సంచారం.. ఈ రాశులవారికి అనుకున్నది జరుగుతుంది..

Shani Gochar 2023: శని గ్రహం చాలా సంవత్సరాల తర్వాత కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారు.  

Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత శని ఆ రాశిలోకి సంచారం.. ఈ రాశులవారికి అనుకున్నది జరుగుతుంది..

Shani Gochar 2023: జోతిష్య శాస్త్రంలో శని దేవుడి ప్రభావం గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ఈ శని కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడని అందరికీ తెలిసిందే.. అయితే శని దేవుడికి, శని గ్రహానికి దగ్గరి సంబంధం ఉంటుంది. శని గ్రహం ఒక రాశిలోకి సంచారం చేస్తే ఆ సంచార కాలం 1 నుంచి 2  సంవత్సరాలు దాకా పట్టే అవకాశాలున్నాయి. ఒక్క సారి శని గ్రహం సంచారం మొదలు పెడితే పూర్తికావడానికి దాదాపు 30 సంవత్సరాల పాటు సమయం పడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ  సంచారానికి చాలా ప్రముఖ్యత నెలకొని ఉంది. ఎందుకంటే ఈ సంచారం కారణంగా చాలా రాశువారు ఊహించని ప్రయోజనాలు పొందుతారు.  అయితే ఈ సంచారం వల్ల ఈ సంవత్సరం  శష మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ యోగం ఏర్పడడం వల్ల ఏయే రాశువారి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభం:
వృషభ రాశి వారికి శని రాశి సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉండబోతోంది. వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు కావడంతో మంచి ప్రయోజనాలే కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శని సంచారం వల్ల జీవితంలో చాలా శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థానాలను ఎదిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో దూర ప్రయాణాలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు.

తుల రాశి:
శని తుల రాశివారికి ఐదవ స్థానంలో ఉండబోతోంది. దీని వల్ల ఈ రాశివారి చాలా రకాల ప్రయోజనాలు కలగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శని దయ ప్రభావంతో పురోగతిలో కూడా మార్పులు సంభవించే ఛాన్స్‌ కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఖర్చులు తగ్గి ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి రెండవ స్థానంలో శని ఉండనుంది. దీంతో శని రాజయోగం ఏర్పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని అనుగ్రహంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో కష్టపడి పనులు చేసేందుకు ప్రయత్నించండి.

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

Read More