Home> ఆధ్యాత్మికం
Advertisement

Saturn Dhaiya 2023: మరో 8 రోజుల్లో కుంభంలోకి శనిదేవుడు.. ఈ రాశులకు శని పీడ నుండి విముక్తి..

Saturn Transit 2023: వేద జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా రెండు రాశులు వారు శని ధైయా ప్రభావం నుండి విముక్తి పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Saturn Dhaiya 2023: మరో 8 రోజుల్లో కుంభంలోకి శనిదేవుడు.. ఈ రాశులకు శని పీడ నుండి విముక్తి..

Saturn Transit In Aquarius 2023: జ్యోతిష్యంలో శనిదేవుని రాశి మార్పు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శని దేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. జనవరి 17న శనిదేవుడు మకరరాశిని వదిలి కుంభరాశిలో ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరిపై శని సడేసతి మరియు ధైయా ప్రారంభం కానుంది. మరికొందరు ఈ శని మహాదశ నుండి విముక్తి పొందనున్నారు. శని సంచారం వల్ల శని మహాదశ (Saturn Dhaiya 2023) నుండి బయటపడనున్న రాశులు ఏవో తెలుసుకుందాం. 

శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన మిథున రాశి మరియు తుల రాశి వారు శని సడే సతి నుండి విముక్తి పొందబోతున్నారు. శని మిథునరాశి వారి జాతకంలో ఎనిమిదవ ఇంట్లో సంచరించి.. అనంతరం తొమ్మిదవ ఇంట్లో నుండి బయటకు వస్తాడు. మరోవైపు శనిదేవుడు తుల రాశి ప్రజల సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో సంచరిస్తున్నాడు. జనవరి 17 నుండి శనిదేవుడు ఈరాశి యెుక్క ఐదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 

శనిదేవుని సంచారంతో మిథునరాశి మరియు తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాధుల నుండి బయటపడతారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 

శనిదేవుడి యెుక్క వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవుతుంది. వీరి అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితం ఉండదు. అందుకే శనిదేవుడిని చాలా మంది క్రూర గ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తన శత్రుగ్రహాలైన సూర్యుడు మరియు అంగారుకుడితో కలిసి ఉన్నాడు. దీని కారణంగా మేష రాశివారిపై శనిదేవుడు ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాడు. 

Also Read: Grah Gochar 2023: కుజుడు, బుధుడు గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశుల అదృష్టం మారడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More