Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Dev: 2025లో కొందరి జాతకాల్లో త్రిభుజ స్థానంలో శని గ్రహం.. ఈ రాశుల వారికి ఏం జరగబోతోంది అంటే?

Shani Dev Dhaiya For Those Zodiac: శని గ్రహం కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి శని త్రిభుజ స్థానంలో ఏర్పడబోతున్నాడు. దీని కారణంగా ఊహించని లాభాలతో పాటు సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశాలున్నట్లు జ్యోతిష్య శాస్త్రం గురించి చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మీరే ఇప్పుడు చూడండి.

Shani Dev: 2025లో కొందరి జాతకాల్లో త్రిభుజ స్థానంలో శని గ్రహం.. ఈ రాశుల వారికి ఏం జరగబోతోంది అంటే?

 

Shani Dev Dhaiya For Those Zodiac: శని దేవుడి పేరు వినగానే ప్రజల మనసుల్లో ఏదో పెద్ద శుభ లేదా అశుభకరమైన మార్పు వస్తుందనే భయం కలుగుతుంది. కానీ శని దేవుడు చేసే పనులను బట్టి తన ప్రతాపాన్ని చూపుతాడు. మంచి పనులు చేసే వారికి శని దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది. అయితే శని దేవుడికి శని గ్రహానికి ప్రత్యేక అనుబంధం ఉంది. శని గ్రహం మీ రాశిలోని శుభస్థానంలో ఉంటే శ్రేయసుకు, ఆనందానికి, ఐశ్వర్యానికి లోటే ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని గ్రహం రాశి సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని అందరికీ తెలుసు.

 అయితే శని దేవుడు రాశి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో సంచార క్రమంలో ఉంది. 2025 సంవత్సరంలో శని గ్రహం మీన రాశిలోకి సంచారం చేస్తుంది. ఈ సంచారంతో శని గ్రహం త్రిభుజ స్థానంలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలు ఊహించని మార్పులకు గురవుతాయి. వీరిలో కొంతమంది భారీ ప్రయోజనాలు పొందడమే కాకుండా ఉన్నత స్థానాల్లోకి ఎదుగుతారని జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు. అయితే ఈ త్రిభుజ స్థానంలో శని ఉండడంవల్ల ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశి వారిపై శని దేవుడి ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

శని గ్రహం సంచారం చేస్తే మేష రాశి వారి జాతకంలో 11వ స్థానంలో సంచార ప్రక్రియ జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా వృత్తి జీవితాన్ని గడుపుతున్న వారికి రెండు సంవత్సరాల పాటు అనేక రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రానికి నుండి చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్త పనులు ప్రారంభించే వారికి ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో గౌరవం దక్కుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

వృషభ రాశి:
శని దేవుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేసే క్రమంలో వృషభ రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారు అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే.. రెట్టింపు పెట్టుబడులతో ముందడుగు వేస్తే వీరు భవిష్యత్తులో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా సమాజంలో మంచి పేరు కూడా లభిస్తుందట.

తులారాశి:
శని గ్రహం సంచారంతో తులా రాశి వారికి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో వీరు సంతాన సౌభాగ్యాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థికపరంగా ఎలాంటి లోటుండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు పొందుతారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ నడుపుతున్న వారు కూడా ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More