Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Dev Remedies: ఈ రోజే రెండో శ్రావణ శనివారం.. శని మహాదశ తొలగిపోవాలంటే ఈ 5 రాశులవారు ఇలా చేయండి!

Shani Dev Remedies: శ్రావణంలో శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శనివారం రోజున శనిదేవుడిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
 

Shani Dev Remedies: ఈ రోజే రెండో శ్రావణ శనివారం.. శని మహాదశ తొలగిపోవాలంటే ఈ 5 రాశులవారు ఇలా చేయండి!

Shani Dev Remedies: హిందువులకు పవిత్రమైన నెల శ్రావణ మాసం, ఈ మాసం శివుడికి  ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో ప్రజలు శివారాధన చేస్తారు. దీంతో పరమేశ్వరుడు సంతోషించి వీరు కోరికలను తీరుస్తాడు. శ్రావణంలో వచ్చే ప్రతి రోజు మురియు తేదీకి  ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే సోమ, మంగళవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాధాన్యం శ్రావణ శనివారానికి  కూడా ఉంది. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఎంతో మంచిరోజు. ఈ రోజే శ్రావణ మాసం రెండో శనివారం. అంతేకాకుండా ఇదే  రోజు శుభకరమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. 

ఈ రాశులపై శనిమహాదశ
శనిమహాదశ, సడేసతి మరియు ధైయాతో బాధపడుతున్న రాశులవారు రెండో శ్రావణ శనివారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శనివక్ర దృష్టి ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఈ కాలంలో మకరం, కుంభం, ధనస్సు, తుల మరియు మిథున రాశులవారు శని యెుక్క ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు. దీంతో ఈ రాశులవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. 

ఒకరోజు 3 యోగాలు
రేపు వచ్చే శనివారం నాడు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, వృద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి.  సర్వార్థ సిద్ధి యోగము మరియు అమృత సిద్ధి యోగము రాత్రి 7.03 నుండి మరుసటి రోజు ఉదయం 5:38 గంటల వరకు ఉంటాయి. ఈ సమయంలో శనిదేవుడి ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.  

శని మహాదశ రాకుండా ఉండాలంటే..
ప్రస్తుతం శని సంచారం కారణంగా మొత్తం 5 రాశులు శని సడే సతి మరియు ధైయాను ఎదుర్కొంటున్నారు.  ఈ రాశులవారు శని యొక్క అశుభ ప్రభావాలను తగ్గించడానికి... శనివారం నాడు శని దేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేయండి. ఆవనూనె దానం చేయండి. ఈ రోజు పొరపాటున కూడా ఐరన్ మరియు ఇనుముతో చేసిన వస్తువులను కొనకండి. శనివారం శని చాలీసా పఠించండి. అలాగే రావిచెట్టు ముందు ఆవనూనె దీపం వెలిగించండి. 

Also Read: Lucky Girl by Zodiac Sign: ఈ రాశిచక్ర గుర్తుల అమ్మాయిలు మనల్ని తొలిచూపులోనే పడేస్తారు! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More