Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Gochar 2022: మకరరాశిలో శనిదేవుడు కదలిక.. 24 గంటల్లో ధనవంతులు అవ్వనున్న ఈ 4 రాశులవారు..

Shani Gochar 2022: శనిదేవుడు అక్టోబర్ 23న తన కదలికను మార్చనున్నాడు. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.  
 

Shani Gochar 2022: మకరరాశిలో శనిదేవుడు కదలిక.. 24 గంటల్లో ధనవంతులు అవ్వనున్న ఈ 4 రాశులవారు..

Shani Gochar 2022: ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశి లేదా ధంతేరాస్ గా జరుపుకుంటారు. ఈ పండుగ దీపావళి ముందు రోజు వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు మరియు ధన్వంతరిని పూజిస్తారు. ఈసారి ధంతేరాస్ అక్టోబరు 23న వచ్చింది. అంతేకాకుండా ఇదే రోజు శనిదేవుడు ఉదయం 4:19 గంటలకు మకరరాశిలో సంచరించనున్నాడు. అంటే అతను నేరుగా నడవనున్నాడు. శని గమనంలో మార్పు మెుత్తం 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశులవారు ధనవంతులు అవ్వనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శని మార్గం ఈ రాశులకు శుభప్రదం
మిధునరాశి (Gemini): శని యెుక్క కదలిక వల్ల ఈ రాశివారికి మేలు జరుగుతుంది. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభపడతారు. దీంతో మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది. 
తులారాశి (Libra): మకరరాశిలో శని సంచారం వల్ల తుల రాశి వారికి చాలా లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి  నుండి లాభపడతారు. వ్యాపారం చేసే వ్యక్తులు లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కెరీర్ లో పురోగతి ఉంటుంది. 
ధనుస్సు రాశి (Sagittarius): శని ప్రత్యక్ష సంచారం ధనుస్సు రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఆదాయం మెండుగా ఉంటుంది. భారీగా డబ్బు ఆదా చేస్తారు. దుబారా తగ్గుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధనలాభం ఉండటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 

Also Read: Dhanteras 2022: ధంతేరాస్ రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే... ఏడాది మెుత్తం మీకు డబ్బే డబ్బు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More