Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Dev Jayanti: శని జయంతి రోజున చేయాల్సిన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే!

Shani Jayanti 2023 Shani Dev: ప్రతి సంవత్సరం ఈ రోజున శని జయంతిని జరుపుకుంటారు. అయితే శని సడే సతి దుష్ర్పభావాలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రోజు శని దేవుడినికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

Shani Dev Jayanti: శని జయంతి రోజున చేయాల్సిన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే!

Shani Jayanti 2023 Shani Dev: శని దేవుడు మనిషి జీవితంలో చేసే మంచి చెడు ఫలితాలను బట్టి ఫలాలిస్తాడు. శని చెడు ప్రభావంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి శనివారం శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా శని జయంతి రోజు శని సడే సతి సమస్యలతో బాధపడేవారు పలు నియమాలు పాటించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సడే సతి వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా సులభంగా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం శుక్ల పక్షంలోని ఈ రోజున శని జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ రోజు శని దేవుడిని ఏ నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది:
శనిదేవుని కళ్లలోకి అస్సలు చూడొద్దు:

శని దేవుడి పూజా కార్యక్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. శనిని పూజించే క్రమంలో ఆయన కళ్లలోకి చూడకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావం కలుగుతుంది. కాబట్టి శని పూజను చేసే క్రమంలో తప్పకుండా ఇది గుర్తుంచుకోండి. 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

శని విగ్రహం ముందు నిలబడకూడదు:
చాలా మంది శని పూజా కార్యక్రమంలో తప్పులు చేస్తున్నారు. అందరూ శని విగ్రహం ముందు నిలబడుతున్నారు. ఇలా చేయడం వల్ల శని సడే సతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

శని దేవుడి పూజా విధానం:
❁ శని జయంతి రోజున పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది. 
❁ నిద్ర లేచి తల స్నానం చేయాల్సి ఉంటుంది. తల స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి.
❁ ఆ తర్వాత శని దేవుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. 
❁ దీపం వెలిగించిన తర్వాత పూజా కార్యక్రమాని ప్రారంభించాలి.
❁ పూజా కార్యక్రమలో భాగంగా శని దేవుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి.
❁ తర్వాత శని చాలీసా పఠించాల్సి ఉంటుంది. 
❁ ఇలా చేయడం వల్ల జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు దూరమవుతాయి. 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More