Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Ast 2023: జనవరి 30 నుంచి 33 రోజుల ఆ రాశులవారు తస్మాత్ జాగ్రత్త, జీవితంలో ఉహించని సమస్యలు

Shani Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిశ్చిత సమయంలో గోచారం, అస్థిత్వం కోల్పోవడం వంటివి ఉంటాయి.  జనవరి 17న శని గ్రహం కుంభరాశిలో గోచారమైంది. జనవరి 30వ తేదీన శని 33 రోజుల వరకూ అస్థిత్వం కోల్పోనుంది. ఆ వివరాలు మీ కోసం..

Shani Ast 2023: జనవరి 30 నుంచి 33 రోజుల ఆ రాశులవారు తస్మాత్ జాగ్రత్త, జీవితంలో ఉహించని సమస్యలు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం జనవరి 17న తనదైన కుంభరాశిలో 30 ఏళ్ల అనంతరం గోచారం జరిగింది. మరో 13 రోజుల అనంతరం అంటే జనవరి 30వ తేదీన కుంభరాశిలో అస్థిత్వం కోల్పోనుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం..

జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం ఆస్థిత్వాన్ని కోల్పోవడం అశుభంగా భావిస్తారు. ఎప్పుడు ఏ గ్రహం అస్థిత్వం కోల్పోయినా..అన్ని రాశుల జాతకుల జీవితంలో సమస్యలు, ఇబ్బందులు పెరుగుతాయి. ప్రత్యేకించి కుండలిలో ఆ గ్రహం అధమ లేదా అశుభ ఫలాలు ఇస్తుంటే. జ్యోతిష్యం ప్రకారం జనవరి 30వ తేదీ రాత్రి 12 గంటల 2 నిమిషాలకు కుంభరాశిలో అస్థిత్వం కోల్పోనుంది. మొత్తం 33 రోజుల వరకూ శని తన రాశిలో అస్థిత్వం కోల్పోయిన స్థితిలో ఉంటుంది. అంటే మార్చ్ 6వ తేదీ రాత్రి 11 గంటల 36 నిమిషాలవరకూ ఇలానే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం ఉన్న రాశులవారు మరింత జాగ్రత్త పాటించాలి.

శని పరిభ్రమణం ఏ నక్షత్రంలో

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రస్తుతం శని భ్రమణం ధనిష్ట నక్షత్రంలో ఉంది. గ్రహాలు నక్షత్రాల పరివర్తనం ప్రభావం కూడా వివిధ రాశుల జాతకాలపై స్పష్టంగా కన్పిస్తుంది. శని అస్థిత్వం కోల్పోవడంతో పాటు నక్షత్ర భ్రమణం కానుంది. కొద్దిరోజుల తరువాత శని గ్రహం శతభిష నక్షత్రంలో మారనున్నాడు. శతభిష నక్షత్రం రాహువు ప్రభావముండే నక్షత్రం. దాంతో సమస్యలు మరింత జటిలం కావచ్చు.

ఆటూ ఫిబ్రవరిలో సూర్యుడి కుంభ రాశి పరివర్తనంతో సూర్యుడు, శని యుతి ఏర్పడనుంది. శతృగ్రహాలు ఒకే రాశిలో ఉండటం వల్ల కూడా కొన్ని రాశుల జీవితంలో సమస్యలు, ఎగుగుదిగుడు రావచ్చు. శనిగ్రహం కూడా ఈ సందర్భంగా అస్థిత్వం కోల్పనుంది. ఈ పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. శని ఉదయించడంతో పాటు సూర్యుడి, శని గ్రహాల యుతి సమాప్తమవడంతో జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయి. దాంతోపాటు శతభిష నక్షత్రం నుంచి బయటకు వచ్చాక..రాశుల జీవితంలో శుభ పరిణామాలు మొదలౌతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని ఉపాయాలున్నాయి. ఈ సందర్భంగా సాధ్యమైనంత ఎక్కువగా పేదలు, ఆపన్నులకు సహాయం చేయాలి. పేదలకు అన్నదానం చేయడం వల్ల శని ప్రసన్నడౌతాడంటారు. శనికి చెందిన వస్తువుల్ని దానం చేయడం కూడా ఈ సమంలో మంచి పరిణామం. దీంతోపాటు ఆవాల నూనెలో మీ ముఖం చూసుకుని ఆ నూనెను దానం చేయాలి. దీనివల్ల శనిదేవుడి అశుభప్రభావం తగ్గుతుంది. శనివారం నాడు రావిచెట్టును పూజించడం, ఆవనూనెతో ీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఉపాయాలు ఆచరించడం వల్ల శని చెడు ప్రభావాన్ని తగ్గించవచ్చు. 

Also read: Grah Gochar 2023: ఫిబ్రవరిలో మారబోతున్న నాలుగు పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More