Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Amavasya 2023: శని అమావాస్య నాడు ఈ ఉపాయాలు ఆచరిస్తే..మీ దారిద్య్రం వదిలిపోతుంది

Shani Amavasya 2023: హిందూమతంలో మాఘమాసం అమావాస్యను మౌనీ అమావాస్య అంటారు. ఏడాది తొలి అమావాస్య శనివారంకావడంతోఆ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఈ శని అమావాస్య నాడు చేయాల్సిన ఉపాయాల గురించి తెలుసుకుందాం..

Shani Amavasya 2023: శని అమావాస్య నాడు ఈ ఉపాయాలు ఆచరిస్తే..మీ దారిద్య్రం వదిలిపోతుంది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి నెల పదిహేనవ తిధిని అమావాస్యగా భావిస్తారు. అమావాస్య రోజు పిత్రులకు సమర్పితమౌతుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. మౌనీ అమావాస్య ఈసారి శనివారం కావడంతో శని అమావాస్యగా కూడా పిలుస్తున్నారు. ఈ మహత్యం కూడా మరింతగా పెరిగింది. ఈసారి మాఘ అమావాస్య జనవరి 21 న శనివారం రోజు ఉంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున వచ్చే అమావాస్యను శని అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున స్నానదానాలకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంది. ఈ రోజున సర్వార్ధ సిద్ధ యోగ సంయోగం ఏర్పడనుంది. ఇది శని అమావాస్య మహత్యాన్ని రెండింతలు పెంచేస్తుంది. ఈ రోజున ఏ విధమైన ఉపాయాలు ఆచరిస్తే శని అమావాస్య రోజున శని కటాక్షం కలుగుతుందనేది తెలుసుకుందాం..

మౌనీ అమావాస్య లేదా శని అమావాస్య నాడు చేయాల్సిన ఉపాయాలు

మౌనీ అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానానికి విశేష మహత్యముంది. నదిలో స్నానం చేస్తే, స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేస్తే మంచి లాభాలుంటాయి. మౌని అమావాస్య రోజు శనివారం కావడంతో దీని మహత్యం మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కుండలిలో ఏదైనా దోషం కష్టాలకు కారణమౌతుంటే..వారు ఈ రోజున ప్రత్యేకంగా శని సంబంధిత ఉపాయాలు ఆచరించాలి. 

శని అమావాస్య రోజున ఎవరైనా పేదవాడికి లేదా ఆపన్నుడికి బట్టలు లేదా ధాన్యం వంటివి దానం చేయాలి. దీనివల్ల వ్యక్తి జీవితంలో వచ్చే కష్టాలు దూరమౌతాయి. వ్యక్తి జీవితంలో కష్టాలు ఎదురౌతాయి. మౌనీ అమావాస్య నాడు పూజాది కార్యక్రమాలతో పాటు వ్రతం కూడా ఆచరించాలి. అంతేకాదు..ఈ రోజున విష్ణు భగవానుడిని పూజించడం వల్ల ప్రత్యేక లాభాలుంటాయి. ఈ రోజున వ్రత కథ చేయడం వల్ల వ్యక్తి కష్టాల్నించి విముక్తుడౌతాడు. ఈ రోజున మౌనంగా ఉండి వ్రతం, శ్రద్ధాకర్మలు, దానాలు చేయడం వల్ల దుఖం దరిద్రం, కాలసర్పం, పితృదోషం నుంచి విముక్తి కలుగుతుంది.

Also read: Saturn Transit effect: శనిగ్రహం నడకలో మార్పు, 11 రోజుల్లో ఆ 4 రాశులపై ఊహించని ధనవర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More