Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Amavasya 2022: నేడే శని అమావాస్య.. ఇకపై ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Shani Amavasya 2022: ఈ అమావాస్య (ఏప్రిల్ 30)ను శని అమావాస్యగా భావిస్తారు. దీంతో రాశీచక్రంలోని రాశుల్లో శని సంచారం జరుగుతుంది. దీని వల్ల అనేక రాశుల వారు శని ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదు. ఈ క్రమంలో శని ప్రభావం కలిగిన 5 రాశుల వారు చేయాల్సిన నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  
 

Shani Amavasya 2022: నేడే శని అమావాస్య.. ఇకపై ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Shani Amavasya 2022: శనిదేవుని అనుగ్రహం పొందడానికి.. శని మహార్దశ సమయంలో కనిపించే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి శని అమావాస్య రోజు చాలా ప్రత్యేకమైనది. ఓ వ్యక్తి తన జాతకంలో శని దోషం కలిగి ఉండడం లేదా శని నివారణకు పరిహారాలను ఆ రోజున చేస్తే చాలా ప్రయోజనం. వైశాఖ మాస అమావాస్య అంటే నేడు (ఏప్రిల్ 30) శని అమావాస్యతో పాటు సూర్య గ్రహణం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో శని నివారణ సంబంధిత చర్యలు తీసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. 

ఈ రాశుల వారు శని పరిహారాలు చేయాలి!

ఏప్రిల్ 29వ తేదీన శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే మీనరాశిలో శనిగ్రహం అర్ధరాశి ప్రారంభమైంది. అంతే కాకుండా కర్కాటకం, వృశ్చికరాశిలో శని ధైయా ప్రారంభమైంది. అంతే కాకుండా ఇప్పటికే కుంభరాశిలో రెండో దశ, మకరరాశిలో చివరి దశ ప్రారంభమైంది.

రాశీచక్రంలో శనిదేవుడు న్యాయాధిపతి అయినందున ప్రతి రాశిపై ఆయన ప్రభావం తప్పకుండా ఉంటుంది. రాశీచక్రంలో శనిదేవుని సంచారం కారణంగా కొన్నిసార్లు చెడు ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ శని అమావాస్య నాడు ఐదు రాశులపై తీవ్ర ప్రభావం ఉంది. ఆ రాశుల వారు శని దేవుని అనుగ్రహం పొందేందుకు ఈ నివారణ చర్యలు చేపడితే మంచిది. 

శని దోషాన్ని తొలగించే పరిహారాలు

1) శని అమావాస్య రోజున నదిలో స్నానం ఆచరిచడం వల్ల శని ప్రతికూల ప్రభావం.. శని దోషం నుంచి ఉపశమనం లభిస్తోంది. దీంతో పాటు జీవితంలో ఏర్పడే బాధలు, అడ్డంకులు తొలగిపోతాయి. 

2) అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. ఆహారం, బట్టలు, బూట్లు, చెప్పులు దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. దీని వల్ల శని దేవున్ని సంతోష పరిచినట్లు అవుతుంది. అంతే కాకుండా నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయడం మంచిది.

3) శని దోష ప్రభావం తగ్గాలంటే నల్ల ఉసిరి, నల్ల నువ్వులు, ఇనుమును నల్ల గుడ్డలో కట్టి నువ్వుల నూనెలో నానబెట్టి శని దేవుడికి సమర్పించాలి. అలా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

4) శని చాలీసా చదవాలి. ప్రతి శనివారం శని చాలీసా, శని స్తోత్రం లేదా శని దశరథ్కృత స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

5) శని అమావాస్య ఇంట్లో శని యంత్రాన్ని స్థాపించడానికి చాలా మంచి రోజుగా పరిగణిస్తారు. దీంతో పాటు రోజూ పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది.
6) నిపుణుల సలహా తీసుకున్న తర్వాత, నల్ల గుర్రపుడెక్కతో ఉంగరాన్ని తయారు చేసి మధ్య వేలుకు ధరించండి.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని పాటించే ముందు మీ దగ్గర్లోని జోతిష్క్యున్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Shani in Dream: నిద్రలో వచ్చే కలలో శనీశ్వరుడు కనిపిస్తే శుభమా? అశుభమా?

Also Read: Shani Transit Effect April 2022: ఏప్రిల్ 29 కుంభరాశిలో ప్రవేశించనున్న శనిగ్రహం.. ఈ రాశివారికి ఎల్లుండితో కష్టాలు తీరినట్టే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More