Home> ఆధ్యాత్మికం
Advertisement

Chandra Grahan 2023: అశ్వినీ నక్షత్రంలో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం.. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి...

Lunar Eclipse 2023: ఈ ఏడాది రెండవ లేదా చివరి చంద్రగ్రహణం పేరు ఖండ్‌గ్రాస్ చంద్రగ్రహణం. ఇది అక్టోబరు నెలలో సంభవించబోతుంది. ఈ గ్రహణం కొందరికి మంచిది కాదు. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

Chandra Grahan 2023: అశ్వినీ నక్షత్రంలో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం.. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి...

Second Chandra Grahan 2023 date: ఈ సంవత్సరం ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం దీపావళికి కొన్ని రోజుల ముందు ఏర్పడనుంది. ఇప్పుడు సంభవించబోయేది ఖండ్‌గ్రాస్ చంద్రగ్రహణం. ఆస్ట్రాలజీలో ఈ గ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ చివరి లేదా రెండో చంద్ర గ్రహణం అక్టోబరు 29, ఆదివారం నాడు ఏర్పడబోతుంది. ఇది అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై.. 02:22 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనుంది. ఈ సంవత్సరం ఏర్పడబోతున్న నాలుగు గ్రహణాల్లో దీనిని మాత్రమే మనం చూడగలం. 

ఈసారి అక్టోబర్ నెలలో వచ్చే ఖండగ్రాస్ చంద్రగ్రహణం అశ్వినీ నక్షత్రం మరియు మేషరాశిలో సంభవిస్తుంది. ఇది అశ్వినీ నక్షత్రంలో పుట్టిన వారికి మరియు మేషరాశి వారికి మంచిది కాదు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యక్తులు గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు.ఈసారి చంద్రగ్రహణం ఉత్తరాది, దక్షిణ అమెరికాలోని పశ్చిమ భాగం మినహా ప్రపంచం మొత్తం కనిపించనుంది. ఈ గ్రహణం నాడు స్నాన దాన యమ నియమాలు పాటిస్తారు. 

Also Read: Lucky Zodiac Signs: హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే రాశులు ఇవే.. మీది ఉందా?

ఈ రెండో చంద్రగ్రహణం ఇండియాలో కనిపిస్తుంది కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లుతుంది. గ్రహణ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేయడం నిషేధం. ముఖ్యంగా పూజలు, శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభించడం వంటివి చేయరు. గర్బిణీలు ఈ సమయంలో బయటకు రావడం మంచిది కాదు. 

Also Read: Mercury transit 2023: మరో 24 గంటల్లో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More