Home> ఆధ్యాత్మికం
Advertisement

Saturn Transit 2023: వచ్చే ఏడాది జనవరిలో కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ రాశులవారిపై సడే సతి స్టార్ట్..

Saturn Transit 2023: శని ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ నెల 23న అంటే ధన్తేరస్ రోజున మార్గంలోకి రానున్నాడు. దీని తరువాత జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది. దీంతో మూడు రాశులవారిపై శని సడేసతి ప్రారంభం అవుతుంది. 
 

Saturn Transit 2023: వచ్చే ఏడాది జనవరిలో కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ రాశులవారిపై సడే సతి స్టార్ట్..

Shani Gochar 2023 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు.  శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని చెడు దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి ధనవంతుడైనా దరిద్రుడిగా మారాల్సిందే. సాధారణంగా శనిగ్రహం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. మళ్లీ శనిదేవుడు 2023లో తన రాశిని (Shani Gochar 2023) మార్చనుంది. 

శనిగ్రహం ఈ ఏడాది ఏప్రిల్ తన రాశిని మార్చింది. జూలైలో శని మకరరాశలో తిరోగమనం చేసింది. ఈ నెల 23న శని తిరోగమనం నుంచి మార్గంలోకి రానుంది. మళ్లీ వచ్చే ఏడాది జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శని మకరరాశిని విడిచి కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని రాశులపై శని సడేసతి (Shani Sade sati) ముగిసి... మరికొందరిపై ప్రారంభమవుతుంది. 

ఈ రాశులపై శని సడే సతి ప్రారంభం..
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే మకర, కుంభ, మీన రాశుల వారిపై శని సడేసతి ప్రారంభమవుతుంది. దీంతో ఈ రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. వీరు ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయంలో శనిదేవుడికి ఇష్టమైన పనులు, పరిహారాలు చేయండి. 

శని పరిహారాలు
శని సడేసతి లేదా ధైయాతో బాధపడే వ్యక్తులు ప్రతి శనివారం నాడు శనిదేవుడిని పూజించాలి. అంతేకాకుండా రావిచెట్టు కింద ఆవాల నూనె దీపం పెట్టాలి. నిస్సయులకు, పేదవారికి దానం చేయండి. ఎవరికీ ఎటువంటి హాని  తలపెట్టవద్దు. స్త్రీలను గౌరవించండి. కుక్కకు సహాయం చేయండి. ఇవన్నీ చేయడం ద్వారా మీరు శని మహాదశ నుండి బయటపడతారు. 

Also Read: Mangal Gochar 2022: మిథునరాశిలో కుజుడి సంచారం.. నెలరోజుల్లో ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More