Home> ఆధ్యాత్మికం
Advertisement

Shash Rajyog benefits: మరో ఆరు రోజుల్లో 'శష్ రాజయోగం'.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Shani Vakri 2023: మరో ఆరు రోజుల్లో శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. దీని కారణంగా అరుదైన శష్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Shash Rajyog benefits: మరో ఆరు రోజుల్లో 'శష్ రాజయోగం'.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Benefits of Shashraj Yog 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి, కర్మదాత అని పిలుస్తారు. శనిదేవుడి గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా శనిదేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో అదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. 2025 వరకు శనిదేవుడు అదే రాశిలో ఉండనున్నాడు. శని 17 జూన్ 10:48 గంటలకు కుంభంలో వ్యతిరేక దిశలో కదలనున్నాడు. నవంబరు 04 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. శని రివర్స్ కదలిక వల్ల శష్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

శష్ రాజయోగం ఈ రాశులకు వరం
సింహం: శని తిరోగమనం సింహరాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. 
వృశ్చికం: శని రివర్స్ కదలిక వల్ల ఏర్పడిన షష్ రాజయోగం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. 

Also Read: Mars Transit 2023: కర్కాటకంలో మంగళ గ్రహం, వచ్చే 21 రోజులు ఈ 5 రాశులకు తిరుగుండదు

కుంభం: శనిదేవుడు ఇదే రాశిలో కూర్చున్నాడు. శష్ రాజయోగం ఈ రాశివారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా తీసుకోండి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Mercury transit 2023: ఏడాది తర్వాత మిథునరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More