Home> ఆధ్యాత్మికం
Advertisement

Vakri Shani Effect: నవంబర్ 4 వరకు తిరోగమనంలో శని.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ..

Vakri Shani Effect: ప్రస్తుతం కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు కుంభరాశిలో వ్యతిరేక దిశలో కదులుతున్నాడు. శని గ్రహం యెుక్క రివర్స్ కదలిక మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Vakri Shani Effect: నవంబర్ 4 వరకు తిరోగమనంలో శని.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ..

Shani Vakri in Kumbh 2023:  ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని చెడు ప్రభావం మీపై పడిందంటే మీరు ధనవంతులైనా దరిద్రులుగా మారాల్సిందే. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉండనున్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక  మూడు రాశులవారికి చాలా ప్రయోజనాలు ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

తిరోగమన శని ఈ 3 రాశులకు వరం
తుల రాశి: శని దేవుడి తిరోగమనం తుల రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు స్థిర చరాస్థులు పొందుతారు. మీరు ఖరీదైన ఇల్లు కొనుగోలు చేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈసమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి. 
మకరం: శని యొక్క రివర్స్ కదలిక వల్ల మకర రాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభిస్తుంది. మీ మాటతీరుతో ప్రజలను ఆకట్టుకుంటారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. 

Also Read: Shukra Gochar 2023: జూలై 07 నుంచి ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. మీ రాశి ఉందా?

వృషభం: శని తిరోగమనం మీకు మంచి రోజులను తీసుకురానుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ జీతం భారీగా పెరుగుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. నిరుద్యోగులకు  ఉపాధి లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

Also Read: Venus Transit 2023: సూర్యుడి రాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ రాశులకు 23 రోజులపాటు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More