Home> ఆధ్యాత్మికం
Advertisement

Sankranti In 2024: సంక్రాంతి పండగ రోజు ఏ పనులు చేయాలి..ఏవి చేయకూడదో తెలుసా.?

Makar Sankranti Rules: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది. ఈరోజు నదీ స్నానం చేసి దానం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో చాలామంది కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. వీటిని ఈ పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు..

Sankranti In 2024: సంక్రాంతి పండగ రోజు ఏ పనులు చేయాలి..ఏవి చేయకూడదో తెలుసా.?

Makar Sankranti Rules: సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగలు సంక్రాంతి ఒకటి ఈ పండగను మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలు, అందమైన ముగ్గులు, గాలిపటాల ఎగరవేతలు, గంగిరెద్దుల గజ్జల సప్పుడు, కమ్మనైన పిండి వంటలతో మకర సంక్రాంతిని ఓ పెద్ద సంబరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సిటీలతో పోలిస్తే పల్లె ప్రాంతాల్లో ఈ పండగను మరెంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు పండు ముసలి తాతల నుంచి యువకుల వరకు పట్టు వస్త్రాలు ధరించి ఎంతో ముస్తాబై కనువిందు చేస్తారు. ఇక పురుషుల విషయానికొస్తే కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలతో సంక్రాంతి రోజంతా హడావిడిగా గడిపేస్తూ ఉంటారు. 

అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన జంటను అత్తమామలు ఇంటికి పిలుచుకొని అల్లుడు, కూతురికి అనేక రకాల వంటకాలను వండి పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే మకర సంక్రాంతికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో సూర్య గ్రహం ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తుంది. దీనికి కారణంగా కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల నుంచి సంక్రాంతిని మకర సంక్రాంతిగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను నాలుగు రోజులకు పైగా జరుపుకుంటారు. మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకొని.. సంక్రాంతి అయిన తర్వాత కనుమ పండుగను జరుపుకోవడం ఓ ప్రత్యేకత. అయితే ఆచారాల ప్రకారం ఈ నాలుగు రోజులపాటు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

సంక్రాంతి రోజు తప్పకుండా ఇది చేయాలి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం సూర్య గ్రహం జనవరి 15వ తేదీన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయబోతుంది కాబట్టి ఇదే రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగల్లో తప్పకుండా చేయాల్సిన వాటిల్లో నది స్నానము ఒకటి. సంక్రాంతి పండగ రోజు తప్పకుండా నదీ స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి కుదరకపోతే ఇంట్లో ఉండే గంగాజలంతో దానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే నది స్నానం చేసిన వారు పట్టు వస్త్రాలు ధరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. సంక్రాంతి పండగ రోజు సూర్యభగవానుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజల నమ్మకం..

సంక్రాంతి పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు:
మకర సంక్రాంతి ముందు రోజు ఆ తర్వాత రోజు ఎట్టి పరిస్థితులలో కొన్ని పనులు చేయకూడదు అందులో ముఖ్యమైనది ఏమిటంటే మాంసం కలిగిన ఆహారాలను తినకూడదు. అంతేకాకుండా ఆహారాలు వండుకునే క్రమంలో ఉల్లిని వెయ్యకుండా చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మద్యపానాన్ని తీసుకోకూడదు. దీంతోపాటు ఈ సమయంలో ఇంటికి వచ్చిన ఏ పేద వాడిని వట్టి చేతులతో ఇంటి నుంచి బయటికి పంపించకూడదు.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More