Home> ఆధ్యాత్మికం
Advertisement

Panch Mahayogam: 700 ఏళ్ల తర్వాత పంచమహా యోగం.. ఈ రాశుల ఇళ్లు డబ్బుతో నిండటం ఖాయం..

Panch Mahayogam: ఆస్ట్రాలజీలో అద్భుత యాదృచ్ఛికం జరిగింది. దాదాపు 700 ఏళ్ల తర్వాత పంచమహా యోగం ఏర్పడింది. ఈయోగం కారణంగా కొన్ని రాశులవారు అదిరిపోయే బెనిఫిట్స్ పొందనున్నారు. 
 

Panch Mahayogam: 700 ఏళ్ల తర్వాత పంచమహా యోగం.. ఈ రాశుల ఇళ్లు డబ్బుతో నిండటం ఖాయం..

Guru shukra yuti in Meen 2023:  సౌర కుటుంబంలోని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. అంతేకాకుండా ఇవి ఇతర గ్రహాలుతో పొత్తులు పెట్టుకుని శుభ మరియు అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. ప్రస్తుతం శని, సూర్యడు కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఇదే విధంగా మీనరాశిలో గురు, శుక్రుడు సంయోగంలో ఉన్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల 5 మహా శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. అవే కేదార్, శంఖ,శష్, జ్యేష్ఠ మరియు సర్వార్ధసిద్ధి యోగాలు. ఇలాంటి అరుదైన కలయిక 700 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఈయోగాల ప్రభావ కారణంగా కొన్ని రాశులకు అదృష్టం పట్టనుంది. 

మిథునం : పంచయోగ ప్రభావం కారణంగా మిథునరాశి వారికి మంచిరోజులు మెుదలవుతాయి. వీరు ఏ పని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారులకు ఇది మంచి సమయం. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ సంపద రెట్టింపు అవుతుంది.
సింహ రాశి : పంచ మహాయోగం కారణంగా వీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తిచేయడంలో సఫలీకృతమవుతారు. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ కెరీర్ మంచి మార్గం ఏర్పడుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. 

ధనుస్సు: పంచ మహాయోగం వల్ల ధనస్సు రాశివారికి మేలు జరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు జీతాలు, ప్రమోషన్లు పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి లాభం పెరుగుతుంది. 
కుంభం: కుంభ రాశి వారికి పంచ మహాయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయాన్ని గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఇదే అనుకూల సమయం.

Also Read: Mangal Gochar 2023: మార్చిలో మిథునరాశిలోకి మార్స్.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More