Home> ఆధ్యాత్మికం
Advertisement

Rahu Ketu Transit: రాహు, కేతువు సంచారం.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!

Rahu Ketu Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు సంచారం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. కానీ, రాహుకేతువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి పూర్తిగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఏఏ రాశుల వారికి శుభప్రద కాలం నడుస్తుందో తెలుసుకుందాం. 
 

Rahu Ketu Transit: రాహు, కేతువు సంచారం.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!

Rahu Ketu Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జాతకంలో రాహు, కేతువుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆయా జాతకాల్లో రాహు, కేతు సంచారం కారణంగా రాశిచక్రాన్ని మార్పుకు దారి తీస్తుంది. దీంతో చేసే పనిలో అడ్డంకులు, చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి సమస్యలు చాలా కాలం పాటు కొనసాగుతాయి. అయితే రాహు, కేతు సంచారం మూలంగా కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. అదే రాశుల వారికో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries)

రాహు, కేతు సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. జీతం పెరిగే అవకాశం ఉంది. ఇతర మార్గాల్లో కూడా డబ్బు లాభపడుతుంది. మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. కొంత డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది.

కర్కాటక రాశి (Cancer)

రాహు, కేతువు సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరగవచ్చు. పదోన్నతులు పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కూడా లాభపడతారు.

తులారాశి (Libra)

తులారాశి వారి జాతకంలో రాహు, కేతు సంచారం కారణంగా ఆనందం, శ్రేయస్సుతో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. డబ్బును సంపాదిస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కూడా ప్రయత్నించవచ్చు. మీరు మీ లక్ష్యాల వైపు దృష్టి సారిస్తే విజయం ఖాయం.

ధనుస్సు రాశి (Sagittarius)

ఈ సంచారం ధనుస్సు రాశి వారికి మంచి ధనలాభాలను ఇస్తుంది. వారు చాలా సంపాదిస్తారు కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రమోషన్ - ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఆనందం కొట్టుకుపోతుంది.

మకరరాశి (Capricorn)

మకర రాశి వారికి రాహు-కేతువుల సంచారం కూడా శుభప్రదంగా ఉంటుంది. వారి ఆదాయం పెరుగుతుంది. తల్లి నుంచి ధనలాభం లభిస్తుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి. ఉద్యోగం లేదా నివాస స్థలంలో మార్పు ఉండవచ్చు. ఏదైనా విజయం సాధిస్తారు.

(నోట్: పైన పేర్కొన్న సమాచారం జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని పరిగణలోకి తీసుకునే ముందు జోతిష్క్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఎక్కడ..? ఆ రాశులకు అనుకూలం, ఈ రాశులకు ప్రతికూలం

Also Read: Todays Horoscope: ఏప్రిల్ 12, 2022న మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More