Home> ఆధ్యాత్మికం
Advertisement

Powerful Dhan Rajyog: 2023లో 'శక్తివంతమైన ధన రాజయోగం'... ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..

Powerful Dhan Rajyog In 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2023 సంవత్సరంలో అరుదైన ధనరాజయోగం ఏర్పడుతుంది. దీంతో నాలుగు రాశులవారు మంచి ధనాన్ని పొందుతారు. 
 

Powerful Dhan Rajyog: 2023లో 'శక్తివంతమైన ధన రాజయోగం'... ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..

Powerful Dhan Rajyog:  2023 సంవత్సరంలో బుధ మరియు శుక్ర గ్రహాల సంచారం వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 15న మీనరాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి శక్తివంతమైన ధన రాజయోగాన్ని సృష్టిస్తున్నాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఈ రాజయోగం (Powerful Dhan Rajyog) వల్ల నాలుగు రాశులవారు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం (Gemini): శక్తివంతమైన ధనరాజయోగంగా కారణం మిథున రాశి వారు భారీగా ధనాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జాతకంలో శుక్రుడు కర్మ స్థానంలో ఉత్కృష్టంగా ఉంటాడు. దీంతోపాటు శుక్రుడు బృహస్పతి గ్రహంతో పొత్తు పెట్టుకోవడం వల్ల హన్స్ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు కొత్త ఏడాదిలో ఆకస్మిక ధనం పొందుతారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ జాతకంలో బుధుడు కూడా భద్ర రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీని కారణంగా మీరు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. 

ధనుస్సు (Sagittarius): ధన రాజయోగం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. శనిదేవుడు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఆస్తి మరియు వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ ప్రేమలో సక్సెస్ అవుతారు. 

కన్య (Virgo): ఈ అరుదైన రాజయోగం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో మీకు డబ్బు, పదవి రెండూ లభిస్తాయి. పరిశోధన రంగంలో నిమగ్నమైన వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు. మీడియా, బ్యాంకింగ్ మరియు సినిమా రంగాలతో సంబంధం ఉన్న వారికి ఈ సమయం బాగుంటుంది. 

మకరం (Capricorn): ధన రాజయోగం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. చమురు, ఇనుము, ఖనిజాలు మరియు పెట్రోలియం రంగాలకు చెందిన వ్యాపారులు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అంతేకాకుండామీ బాస్ ప్రశంసలు అందుకుంటారు. 

Also Read: Mercury Planet: బుధుడి రాశిలో మార్పు... న్యూ ఇయర్ లో ఈ రాశులవారిపై డబ్బు వర్షం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More