Home> ఆధ్యాత్మికం
Advertisement

Phalguna Purnima 2022: ఫాల్గుణ పంచమి నాడు ఈ పూజ చేస్తే ఏడాది పాటు డబ్బే డబ్బు!

Phalguna Purnima 2022: ఫాల్గుణ మాసంలో శ్రీపంచమి నాడు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పర్వదినాన్ని పలు ప్రాంతాల్లో శ్రీపాద పంచమి అని కూడా పిలుస్తారు. లక్ష్మీ మాతతో పాటు సంపదలకు అధిపతి అయిన కుబేరున్ని ఈరోజున ప్రసన్నం చేసుకోవడం వల్ల ఇంట్లో ధనప్రాప్తితో పాటు వైభోగం వస్తుంది. 
 

Phalguna Purnima 2022: ఫాల్గుణ పంచమి నాడు ఈ పూజ చేస్తే ఏడాది పాటు డబ్బే డబ్బు!

Phalguna Purnima 2022: తెలుగు సంవత్సరాదిలో చివరిదైన ఫాల్గుణ మాసంలో 21వ రోజు పంచమి తిథి. ఈ మాస పంచమిని శ్రీపాద పంచమి అని కూడా అంటారు. లక్ష్మీ మాత అనుగ్రహం పొందేందుకు ఈ రోజు శుభప్రదంగా భక్తులు భావిస్తారు. వాస్తవానికి, పంచమి తిథి సంపదలకు అధిపతి అయిన కుబేరినికి శ్రేష్టమైనది. జోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీపంచమి నాడు కొన్ని ప్రత్యేక పూజలను నిర్వహించడం వల్ల ఇంట్లో సంపద, వైభోగం సిద్ధిస్తుంది. అయితే ఈ ఫాల్గుణ శ్రీపంచమి నాడు చేసే పూజ విధివిధానాలను తెలుసుకుందాం. 

ఫాల్గుణ శ్రీపంచమి పూజ విధానం

జోతిష్య శాస్త్రం ప్రకారం.. శ్రీపాద పంచమి నాడు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదం. ఈరోజున లక్ష్మీ దేవిని పూజించడం మరింత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ఆ రోజున లక్ష్మీ దేవికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి.. కుంకుమతో పూజ చేయాలి. ఆ తర్వాత “ఓం శ్రీపాదాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత పూజించిన వస్త్రాన్ని డబ్బు దాచే ప్రదేశంలో పెట్టడం వల్ల ధనప్రాప్తి లభిస్తుంది. 

ఫాల్గుణ శ్రీపంచమి పూజ నియమాలు

లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, పూజించేందుకు లక్ష్మీ దేవీ విగ్రహాం లేదా ప్రతిమను ఎంపిక చేసుకోవాలి. లక్ష్మీ మాతను గులాబీలు, తామర పువ్వును సమర్పించడం వల్ల ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు.

(నోట్: పైన పొందుపరిచిన సమాచారం జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించినది. వీటిని పాటించే ముందు ఒకసారి సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)    

Also Read: Surya Dev Pooja: ఆదివారం సూర్యదేవున్ని ఇలా ప్రార్థిస్తే అదృష్టం మీ తలుపు తడుతుంది!

Also Read: Chanakya Niti: ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More