Home> ఆధ్యాత్మికం
Advertisement

Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ మాసంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం!

Phalguna Month: ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఫాల్గుణ మాసం వచ్చేసింది.. సంతోషాలకు.. పర్వదినాలకు నెలవైనా ఫాల్గుణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది.

Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ మాసంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం!

Significance Of Phalguna Masam: ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. హిందూ సంవత్సరంలో ఫాల్గుణ మాసం చివరిది. ఈ మాసాన్ని ఆనందం, సంతోషాలకు నెలవుగా భావిస్తారు. ఈ మాసం శీతాకాలం చివరలో వచ్చి.. వేసవికి స్వాగతం పలుకుంది. 

మహాశివరాత్రి, హోలీ తదితర పండుగలన్నీ ఈ మాసంలోనే వస్తాయి. ఈ నెల ఫిబ్రవరి 17 నుచి మార్చి 18 వరకు ఫాల్గుణ మాసం ఉంటుంది. ఫాల్గుణ మాసంలోని ముఖ్యమైన రోజులు, కొన్ని రోజ్లుల్లో చేపట్టాల్సిన పూజలు తదితర వివరాలు ఒకసారి చూద్దాం పదండి.

మనం ఏడాది పొడవునా దేవుళ్లను పూజిస్తూ ఉంటాం. అయితే కొన్ని నెలల్లో మాత్రం ప్రత్యేక పూజలు చేపడుతాం. ఫాల్గుణ మాసంలో కూడా అలాంటి ప్రత్యేక పూజలు చాలా నిర్వహిస్తాం. 

దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందాలనుకునే వారు ఫాల్గుణ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఆర్థిక ఇబ్బందులుపడుతున్న వారు ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి.

ఇక ఫాల్గుణ మాసంలో, విష్ణువు, శివునికి సంబంధించిన చాలా ముఖ్యమైన పండుగలు జరుపుకుంటాం. కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి నిర్వహించుకుంటాం. అలాగే శుక్ల ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును ఆరాధించడం ఎంతో మంచింది. ఈ రెండు పండుగలు కూడా హిందువులకు చాలా ముఖ్యమైనవి.

ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలకీ ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే ఆయన అనుగ్రహం పొందొచ్చు. మాఘమాసంలో లాగానే ఫాల్గుణ మాసంలో కూడా దానధర్మాలు చేస్తే చాలా మంచిది. అలాగే ఫాల్గుణ మాసంలో పితృదేవతలకు తర్పణం చేయడం మంచిది. తెల్ల నువ్వులు, నెయ్యి, ఆవాల నూనె, సీజనల్ ప్రూట్స్‌ వంటివి దానం చేస్తే ఎంతో మంచిది.

Also Read: Chanakya Niti: ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే!

Also Read: Vastu Tips: సంసారం సాఫీగా సాగిపోయేందుకు బెడ్ రూమ్ వాస్తు టిప్స్

 

Read More