Home> ఆధ్యాత్మికం
Advertisement

Palmistry predictions: మీ అరచేతి ఆకారం, రంగు చూసి భవిష్యత్ తెలుసుకోవచ్చట!

Palmistry predictions: చేతిని చూసి వారి భవిష్యత్ ఎలా ఉందో చెబుతుంటారు హస్త సాముద్రికులు. రాధేశ్యామ్ సినిమా ద్వారా దీనికి మరింత క్రేజ్ వచ్చింది. మరి నిజ జీవితంలో సాముద్రిక శాస్త్రం ద్వారా ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చనేది ఇప్పుడు చూద్దాం.

Palmistry predictions: మీ అరచేతి ఆకారం, రంగు చూసి భవిష్యత్ తెలుసుకోవచ్చట!

Palmistry prdecitons: సాముద్రిక శాస్త్రం.. రాధేశ్యామ్ సినిమాతో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో హీరో ప్రభాస్​ హస్త సాముద్రికుడిగా నటించారు. చేతులు చూసి ఆ వ్యక్తి భవష్యత్ ఎలా ఉండబోతుందో చెబుతారు. అతను చెప్పిన విషయాలు 99 శాతం నిజమవుతుంటాయి కూడా. అయితే సినిమాలోనే కాకుండా సాముద్రిక శాస్త్రానికి నిజ జీవితంలోను చాలా ఆదరణ ఉంది. ఎంతో మంది చేతులు చూసి వారి భవిష్యత్​ ఎలా ఉంటుందో చెబుతుంటారు.

చేతిలో రేఖలు, చేతి పరిమాణం వంటి వాటిని బట్టి సాముద్రిక శాస్త్ర నిపుణులు వారి భవిష్యత్​ చెబుతుంటారు. అలా కొన్ని సాధారణ లక్షణాలను బట్టి వారి స్వభావం, వారి జీవితం ఎలా ఉంటుంది అనేది చెబుతున్నారు. మరి చేతుల ఆకారాలను బట్టి వారి భవిష్యత్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.

ఆర చెయ్యి పెద్దగా ఉంటే..

అరచేయ్యి పెద్దగా ఉంటే.. వారు జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఏ మాత్రం అజాగ్రత్తను ఇష్టపడరు. ముఖ్యంగా పనిలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను కూడా సహించరు.

చెయ్యి మృదువుగా ఉంటే..

సాముద్రిక శాస్త్రం ప్రకారం మృదువైన అరచెయ్యి ఉంటే వారు చాలా పవిత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. జీవితంలో ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని పొందుతారు.

ఆర చెయ్యి ధృడంగా, ముదురుగా ఉంటే..

అర చేయ్యి ముదురుగా ఉంటే.. ఆ వ్యక్తులు కర్మను ఎక్కువగా నమ్ముతారు. అదృష్టంపై ఎక్కువగా ఆధారపడరు. తాము చేసే పనిపై పూర్తి నమ్మకం పెడతారు. సమయాన్ని వృధా చేయడం వీరికి ఇష్టముండదు.

అర చెయ్యి చిన్నగా ఉన్న వ్యక్తులు..

అర చెయ్యి చిన్నగా ఉన్న వ్యక్తులు స్వచ్చమైన హృదయంతో ఉంటారు. ఎవ్వరికీ హాని చేయాలనుకోరు. నిత్య విద్యార్థిలా ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఇష్టపడతారు.

ఎర్రటి అరచెయ్యి ఉంటే..

అరచేతులు ఎర్రగా ఉన్న వ్యక్తులు అదృష్టవుంతులని చెబుతున్నారు సాముద్రిక నిపుణులు. అలా ఉన్నా వారికి ఆస్తీ, ఐశ్వర్యంతోపాటు సంఘంలో గౌరవం కూడా ఉంటుందని చెబుతున్నారు. జీవితాంతం ఆనందంగా గడుపుతారని అంటున్నారు.

(నోట్​:ఈ కథనంలో చెప్పిన విషయాలు కేవలం సాముద్రిక శాస్త్ర నిపుణుల వ్యక్తిగత అభిప్రయాలు మాత్రమే. వాటిని Zee తెలుగు News ధృవీకరించదు.)

Also read: Horoscope Today March 12 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!

Also read: Luckiest Zodiac Signs: ఈ రాశుల వారిపై లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More