Home> ఆధ్యాత్మికం
Advertisement

Narak Chaturdashi 2022: నరక చతుర్దశి రోజున ఇలా చేస్తే అన్ని శుభాలే..!

Narak Chaturdashi 2022: హిందూ సాంప్రదాయం ప్రకారం.. ధన త్రయోదశి (Dhanteras) తర్వాత మరుసటి రోజు నరక చతుర్దశి పండుగ జరుపుకుంటారు. అయితే ఐదు రోజుల దీపావళి పండగలో నరక చతుర్దశిన కూడా పలువురు దేవతలను పూజించాలని శాస్త్రం పేర్కొంది.

Narak Chaturdashi 2022: నరక చతుర్దశి రోజున ఇలా చేస్తే అన్ని శుభాలే..!

Narak Chaturdashi 2022: హిందూ సాంప్రదాయం ప్రకారం.. ధన త్రయోదశి (Dhanteras) తర్వాత మరుసటి రోజు నరక చతుర్దశి పండుగ జరుపుకుంటారు. అయితే ఐదు రోజుల దీపావళి పండగలో నరక చతుర్దశిన కూడా పలువురు దేవతలను పూజించాలని శాస్త్రం పేర్కొంది. నరక చతుర్దశి రోజున యమ ధర్మరాజును పూజిస్తే.. సకల శుభాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా పలువురు  శ్రీ కృష్ణుడు,  కాళీ మాతను కూడా పూజిస్తారు. ఈ సారి నరక చతుర్దశిని అక్టోబర్ 23న జరుపుకోవాలని శాస్త్రం చూచిస్తోంది.

పంచాగం ప్రకారం.. నరక చతుర్దశి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని, కృష్ణ పక్షన చతుర్దశి నాడు జరుపుకుంటారు. అయితే గ్రంథాల ప్రకారం శ్రీ కృష్ణుని పూజించాలని శాస్త్రం చూచిస్తోంది. ఈ చతుర్ది గురించి.. నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీ కృష్ణుడి భార్య సత్యభామ చంపడంతో ఈ పండని జరుపుకుంటారని పేర్కొన్నాయి. నరకాసురుడిని సంహరించిన రోజు నరక చతుర్దశి అని భారతీయులు నమ్ముతారు.

నరక చతుర్దశి రోజున శుభ సమయాలు:
నరక చతుర్దశి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని.. కృష్ణ పక్ష చతుర్దశిన జరుపుకుంటారు. ఈసారి కార్తీక చతుర్దశి తిథి 23 అక్టోబర్ 2022 సాయంత్రం 6.03 నుంచి 24 అక్టోబర్ 2022 సాయంత్రం 5:27న ప్రారంభంకానుంది. అందుకే నరక చతుర్దశిని అక్టోబర్ 23 ఆదివారం జరుపుకుంటారు.

నరక చతుర్దశి పూజా విధానం:
నరక చతుర్దశి రోజునా తప్పకుండా శుభ్రమైన బట్టలు ధరించాలి. అయితే ఇంటికి ఈశాన్యంలో పూజను నిర్వహించాలని నిపుణులు అభిప్రాతయపడుతున్నారు. పూజలో భాగంగా సూర్య దేవుడు, గణేశుడు, దుర్గ, శివుడు, విష్ణు దేవుడి ప్రతిమలు పెట్టి పూజిస్తే మంచి లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా నుదుటిపై పసుపు లేదా చందనం తిలకం రాసుకోవాలి. నెయ్యితో దీపాలు వెలిగించి.. నైవేద్యంగా ఫలాలను సమరిస్తే.. ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More