Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. రేపటి నుండి ఈ 4 రాశులకు దశ తిరగనుంది..

Budh Gochar 2022: గ్రహాల రాకుమారుడు బుధుడు రేపు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు ఈ రాశులకు చాలా శుభప్రదంగా ఉండనుంది. 
 

Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. రేపటి నుండి ఈ 4 రాశులకు దశ తిరగనుంది..

Budh Gochar 2022: గ్రహాల యువరాజు రేపు అంటే నవంబరు 13న వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం (Mercury transit in Scorpio 2022) అన్ని రాశులవారిపై పడుతుంది. తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపారానికి కారకుడిగా మెర్య్కూరీని భావిస్తారు. ఎవరి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి జీవితంలో దేనికీ లోటు ఉండదు. బుధుడి రాశి మార్పు ఏరాశులకు శుభప్రదమో తెలుసుకుందాం. 

వృశ్చికరాశి (Scorpio): నవంబర్ 13న బుధుడు తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.  
కర్కాటకం (Cancer): వృశ్చికరాశిలో బుధుడు ప్రవేశం కెరీర్ పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సంచారం మీ జాతకంలోని ఐదవ ఇంట్లో జరగబోతోంది. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించనున్నారు. బిజినెస్ పెంచుకోవడానికి ఇదే మంచి సమయం. జీవితంలో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. విద్యారంగంలో నిమగ్నమైన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

కన్య (Virgo): కన్యారాశిలో బుధుడు ప్రవేశం ఈరాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శక్తి పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మంచి అవకాశాలు మీకు వస్తాయి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. మీ లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతమవుతారు. మీ బాస్ యెుక్క ప్రశంసలు అందుకుంటారు. 
మీనం (Pisces): బుధ సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలను సాధిస్తారు. ఈరాశివారికి కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. వ్యాపారం నిమిత్తం మీరు చేసే ప్రయాణాలు లాభిస్తాయి. 

Also Read: Surya Dev Puja: వృశ్చిక సంక్రాంతి రోజున ఇలా చేస్తే.. మీకు డబ్బు, కీర్తి పెరుగుతాయి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More