Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2023: జూలై 8న కర్కాటక రాశిలోకి బుధుడు... ఈ 4 రాశుల వారిపై నోట్ల వర్షం..

Mercury transit 2023: జూలై ప్రారంభంలో బుధుడు తన గమనాన్ని మార్చనున్నాడు. మెర్క్యూరీ మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.

Budh Gochar 2023: జూలై 8న కర్కాటక రాశిలోకి బుధుడు... ఈ 4 రాశుల వారిపై నోట్ల వర్షం..

Budh Gochar in Kark 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. ఇతడిని సంపద, వ్యాపారం, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. వచ్చే నెల 08న బుధుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ సంచారం ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. కర్కాటక రాశిలో బుధుడి సంచారం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

బుధుడి సంచారం ఈ రాశులకు వరం

వృషభం - బుధుడి సంచారం వృషభరాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.

కర్కాటకం - ఇదే రాశిలో బుధుడి సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళ్తారు. మీరు అనుకున్నది సాధిస్తారు.

Also Read: Shukra Gochar 2023: జూలై 07న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 5 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం!

కన్యారాశి- బుధుడి రాశి మార్పు వల్ల కన్యారాశి వారికి కోరికలు నెరవేరుతాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల సపోర్టు మీకు ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. మీ జీతం పెరగవచ్చు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.

తుల రాశి - బుధుడు గోచారం తులారాశి వారి కెరీర్ లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ పెరగడంతోపాటు మంచి లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న స్థాయికి వెళతారు.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Shani Trayodashi 2023: శని త్రయోదశి ప్రాముఖ్యత, శని వ్రతం పాటించడం వల్ల కలిగే లాభాలు, పూజా విధానం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More