Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2022: కన్యా రాశిలోకి బుధుడు... రాబోయే 2 నెలలు ఈ రాశులకు డబ్బే డబ్బు..!

Budh Gochar 2022: ఇవాళ బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశి సంచారం 4 రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ను అందించనుంది. 
 

Budh Gochar 2022: కన్యా రాశిలోకి బుధుడు... రాబోయే 2 నెలలు ఈ రాశులకు డబ్బే డబ్బు..!

Budh Gochar 2022: బుధుడు.. తెలివితేటలు, తర్కం, వ్యాపారం, సంపదలకు కారకుడు. బుధుడు తన రాశి చక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. బుధ గ్రహం ఇవాళ అంటే ఆగస్టు 21న తన రాశిని మార్చబోతున్నాడు. ఈ రోజు బుధుడు కన్య రాశిలోకి (Mercury Transit in Virgo 2022) ప్రవేశిస్తాడు. అక్కడే అక్టోబరు 26 వరకు ఉంటాడు. బుధుడు రాశి మార్పు నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభం (Taurus)- కన్యారాశిలో బుధుని ప్రవేశం వృషభ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. జాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నుండి లాభం ఉంటుంది. 

మిథునరాశి (Gemini)- ఈ బుధ సంచారం మిథున రాశి వారికి  చాలా లాభాలను ఇస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో మీరు కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా లేదా ఎవరి వద్దనైనా చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

సింహరాశి (Leo)- బుధుని రాశి మార్పు సింహరాశి వారికి మేలు చేస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారు మంచి ఫలితాలను సాధిస్తారు.  

కన్య (Virgo)- బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ రాశిపై బుధ సంచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తుల కెరీర్ రాబోయే 2 నెలలు శుభప్రదంగా ఉంటుంది. కొత్త జాబ్ రావచ్చు. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 

Also Read: Budh Gochar 2022: కన్యా రాశిలో బుధుడి సంచారం... ఏ రాశివారికి లాభం? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More