Home> ఆధ్యాత్మికం
Advertisement

Mercury transit 2022: వృశ్చికరాశిలోకి బుధుడు... వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్..

Mercury transit 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. నవంబర్ నెలలో గ్రహాల యువరాజు బుధుడు రాశిని మార్చనున్నాడు. దీంతో కొందరికి ధన నష్టం కలుగనుంది.  
 

Mercury transit 2022: వృశ్చికరాశిలోకి బుధుడు... వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్..

Budh Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం ఒక పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. అయితే నవంబరులో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు ఉన్నాయి. అందులో ఒకటి బుధ గ్రహ సంచారం. గ్రహాల రాకుమారుడైన బుధుడు నవంబరు 13, రాత్రి 9.28 గంటలకు వృశ్చికరాశిలోకి (Mercury transit in Scorpio 2022) ప్రవేశించనున్నాడు. దీని సంచారం వల్ల కొన్ని రాశులవారికి అపారమైన డబ్బు నష్టం కలుగుతుంది. అంతేకాకుండా తీవ్రఇబ్బందులకు గురవుతారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశి (Aries): ఈరాశి యెుక్క మూడో, ఆరో ఇంటి బుధుడు అధిపతి. దీంతో ఈరాశివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఏదైనా జబ్బుతో ఇబ్బంది పడవచ్చు. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. 

మిథున రాశి (Gemini): ఈ రాశి వారి యెుక్క నాల్గవ ఇంటికి అధిపతి బుధుడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కుటుంబ జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు. మెుత్తానికి ఈ సమయం బాధాకరంగా ఉంటుంది.  

కర్కాటక రాశి (Cancer): ఈ రాశి యెుక్క పన్నెండవ మరియు మూడవ ఇంటికి బుధుడు అధిపతి. దీంతో మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి, బయట వస్తువులను తినవద్దు.  

సింహ రాశి (Leo): ఈ రాశి యెుక్క రెండవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి బుధుడు. ఈ సమయంలో మీ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు కూడా పడవచ్చు. 

కన్య రాశి (Virgo): పదవ మరియు మొదటి ఇంటికి బుధుడు అధిపతి. సన్నిహతులు గొడవలు రావచ్చు. మెుత్తానికి ఈ సమయం కొంచెం వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది.  
ధనుస్సు రాశి (Sagittarius): ఏడవ మరియు పదవ ఇంటికి అధిపతి బుధుడు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో మీపై ఆర్థిక భారం పడుతుంది

Also Read: Gajakesari Yoga: మీనరాశిలో గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More