Home> ఆధ్యాత్మికం
Advertisement

Mercury transit 2023 Effect: శని రాశిలో బుధుడి ప్రవేశం, మార్చ్ 1 నుంచి ఈ 3 రాశులకు మహర్దశ, రెండు చేతులా సంపాదన

Mercury transit 2023 Effect: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా, మరి కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..

Mercury transit 2023 Effect: శని రాశిలో బుధుడి ప్రవేశం, మార్చ్ 1 నుంచి ఈ 3 రాశులకు మహర్దశ, రెండు చేతులా సంపాదన

సరిగ్గా 3 రోజుల తరువాత బుధుడి గోచారం ఉంది. చాలా రాశులకు ఇది అత్యంత శుభ సూచకం కానుంది. కొన్ని సూచనలు పాటిస్తే ప్రతికూలంగా ఉండేవారికి కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. రెండు చేతులా సంపాదిస్తారు. 

ఫిబ్రవరి 27వ తేదీ 2023లో బుధుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం గోచారం చేయడం వల్ల మొత్తం 12 రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంది. బుధుడు ఏ రాశిలోనైనా దాదాపుగా నెల రోజులుంటాడు. ఆ తరువాత మరో రాశిలో ప్రవేశిస్తుంటాడు. బుధ గ్రహాన్ని సాధారణంగా వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు. బుధుడి శని గ్రహ రాశిలో ప్రవేశించడం వల్ల చాలా రాశులకు అమితమైన ప్రయోజనాలు కలగనున్నాయి. 

హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉన్నందునే..గ్రహాల రాశి పరివర్తనంను మహత్యంగా భావిస్తారు. మార్చ్ 1వ తేదీన బుధుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. ఈ క్రమంలో కొన్న రాశులపై పాజిటివ్, నెగెటివ్ ప్రభావాలు రెండూ కన్పిస్తాయి. ఏ రాశులపై శుభ ప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశులకు ఊహించని ధనలాభం, వ్యాపారంలో వృద్ధి యోగం ఏర్పడుతుంది. దాంతోపాటు కుండలిలో బుధుడిని అశుభ ప్రభావాలు దూరం చేసేందుకు ఈ ఉపాయాలు అవలంభించాల్సి ఉంటుంది. 

మేషరాశి

జ్యోతిష్యం ప్రకారం బుధుడు కుంభ రాశిలో గోచారం చేయడం మేష రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. ఈ రాశి 11వ పాదంలో బుధుడి ప్రవేశిస్తుండటం వల్ల ఉద్యోగులకు చాలా అనువైన సమయం. అంతేకాకుండా..కష్టపడినవారికి చాలా లాభముంటుంది. ప్రేమ జీవితంలో కొద్దిగా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ జాతకులు ఓ నెల రోజులు విష్ణువుని శ్రీ వామన రూపంలో పూజించాలి. 

వృషభ రాశి

బుధుడు వృషభరాశి 10వ పాదంలో గోచారం చేయనున్నాడు. దీనివల్ల మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఈ కాలంలో పై ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. నెల రోజుల వరకూ బుధ సంబంధిత ఉపాయాలు ఆచరించడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కాలంలో వీలైనంత వరకూ ఆవులకు ఆహారం తినిపించాలి. నియమిత పద్ధతి ప్రతిరోజూ లేదా ప్రతి బుధవారం ఇలా చేయాల్సి ఉంటుంది. 

సింహరాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు సింహ రాశి 7వ పాదంలో గోచారం చేయనున్నాడు. ఈ క్రమంలో వ్యాపారులకు అత్యంత అనువైన సమయం. ఈ కాలంలో చాలా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కుటుంబ జీవితంలో కొద్దిగా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రతి బుధవారం నాడు శ్రీ గణపతిని పూజించాలి.

Also read: Grah Gochar 2023: మార్చి నెలలో గ్రహాల గమనంలో పెను మార్పు... ఈ 5 రాశులవారు జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More