Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2024: శనిదేవుడి రాశిలోకి గ్రహాల యువరాజు.. ఫిబ్రవరి 20 నుంచి ఈ 3 రాశులకు అన్నీ మంచి రోజులే..

Budh Gochar in Feb 2024: గ్రహాల యువరాజైన బుధుడు మరో ఐదు రోజుల తర్వాత కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. 
 

Budh Gochar 2024: శనిదేవుడి రాశిలోకి గ్రహాల యువరాజు.. ఫిబ్రవరి 20 నుంచి ఈ 3 రాశులకు అన్నీ మంచి రోజులే..

Mercury Transit 2024 effect: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మరో ఐదు రోజుల తర్వాత ఫిబ్రవరి 20న గ్రహాల యువరాజైన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారు వృత్తి మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మెర్క్యూరీ కుంభరాశి ప్రవేశం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి 
సింహరాశి వారికి బుధుడు సంచారం చాలా మేలు చేస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు నలుగురిలో గుర్తింపు పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. 
వృషభం
కుంభరాశిలో బుధుడు సంచారం వల్ల వృషభరాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీరు భారీగా డబ్బును పొదుపు చేస్తారు. మీరు కెరీర్ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని  సాధిస్తారు. 

Also Read: Rathasaptami 2024: రథసప్తమి నాడు బుధాదిత్య యోగం.. ఈ 5 రాశులకు సూర్యభగవానుడి అనుగ్రహం..

మిధునరాశి
బుధుడి రాశి మార్పు మిథునరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఆఫీసులో మీ పనిని బాస్ ప్రశంసిస్తాడు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు పేదరికం నుండి బయటపడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఫారిన్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. 

Also Read: Holi 2024 date: ఈ ఏడాది హోలీ ఎప్పుడు? హోలికా దహనం ఎందుకు చేస్తారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More