Home> ఆధ్యాత్మికం
Advertisement

Mercury transit 2023: ఏడాది తర్వాత మిథునరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం..

Mercury transit 2023: గ్రహాల యువరాజు బుధుడు ఈ నెల 24న మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి యెుక్క ఈరాశి మార్పు మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 
 

Mercury transit 2023: ఏడాది తర్వాత మిథునరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం..

Budh Gochar 2023 in Mithunam: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. డబ్బు, వ్యాపారం, తెలివితేటలకు కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. బుధుడి రాశిని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. జూన్ 24న బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఏడాది తర్వాత బుధుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ సంచారం వల్ల కొన్ని రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి సంచారం ఈ రాశులకు వరం
మేషం: బుధుడు రాశి మారడం వల్ల మేష రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ప్రతి పనిని వందశాతంతో పూర్తి చేస్తారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పాతపెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 
కన్య: కన్యా రాశి వారికి బుధుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. 

Also Read: Mars Transit 2023: కర్కాటకంలో మంగళ గ్రహం, వచ్చే 21 రోజులు ఈ 5 రాశులకు తిరుగుండదు

కుంభం: మెర్క్యూరీ సంచారం కుంభ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.  మీ డబ్బు పెరుగుతుంది. పరిశోధన రంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. 

Also Read:Venus Transit 2023: జూలైలో శుక్రుని గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More