Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Transit 2023: త్వరలో కుంభంలో బుధుడి గోచారం... ఈ 3 రాశుల వారి కెరీర్ అమోఘం..

Budh Transit 2023: పంచాంగం ప్రకారం, బుధ గ్రహం కుంభరాశిలో సంచరించబోతోంది. దీంతో మూడు రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. 
 

Budh Transit 2023: త్వరలో కుంభంలో బుధుడి గోచారం... ఈ 3 రాశుల వారి కెరీర్ అమోఘం..

Budh Transit In Kumbh 2023: ప్రతి గ్రహం కొంత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం మనిషి జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. గ్రహ గమనంలో వచ్చిన మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. ఫిబ్రవరి 27న  బుధ గ్రహం కుంభరాశిలో సంచరించనుంది. ఈ గ్రహ మార్పు మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మకర రాశిచక్రం
మెర్క్యురీ సంచారం మకరరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి రెండవ ఇంట్లో జరగబోతోంది. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. డబ్బు సమస్యలు తీరుతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పాతపెట్టుబడుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. 
సింహ రాశి
బుధుడి రాశి మార్పు సింహరాశివారికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో జరగబోతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగుంటుంది. మీరు ఏ పనిచేపట్టినా అందులో సక్సెస్ అవుతారు. 
వృషభ రాశి
వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ పరంగా బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో కదలబోతోంది. దీంతో మీరు మీ కెరీర్ లో ముందుకు సాగుతారు. వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. మీ పనిలో పురోగతి సాధిస్తారు. 

Also Read: Surya Mahadasha 2023: సూర్య మహాదశ అంటే ఏమిటి? ఇది మీ జాతకంలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More