Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2023: తులరాశిలోకి వెళ్లనున్న బుధుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Budh Gochar 2023: మరికొన్ని రోజుల్లో బుధుడు తులరాశి ప్రవేశం చేయనున్నాడు. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించబోతుంది. 
 

Budh Gochar 2023: తులరాశిలోకి వెళ్లనున్న బుధుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Mercury transit 2023 in Libra: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు మరియు ఫ్లానెట్స్ ప్రిన్స్ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. ఈనెల మధ్యలో అంటే అక్టోబరు 19న బుధుడు తులరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుని గమనంలో ఈ మార్పు వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

మిథునరాశి 
బుధుడి రాశి మార్పు మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మెర్క్యూరీ సంచారం వల్ల మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
మేష రాశి
తులరాశిలో బుధ సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. బుధుడి సంచారం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
ధనస్సు రాశి
మెర్క్యూరీ ట్రాన్సిట్ ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆదాయం పెరుగుుతంది. మీకు వివిధ వనరులు ద్వారా డబ్బు సమకూరుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: Mangal-Ketu Yuti 2023: కుజుడు, కేతువు గ్రహాల కలయికలతో ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More