Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2022: అక్టోబరు 26న తులరాశిలోకి బుధుడు.. ఈ రాశులకు అపారమైన ప్రయోజనం..

Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు మరో కొన్ని రోజుల్లో రాశిని మార్చనున్నాడు.  దీంతో కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. 
 

Budh Gochar 2022: అక్టోబరు 26న తులరాశిలోకి బుధుడు.. ఈ రాశులకు అపారమైన ప్రయోజనం..

Budh Gochar 2022: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. బుధుడు కూడా త్వరలోనే తన రాశిని మార్చనున్నాడు. అక్టోబరు 26న యువరాజు బుధుడు తులరాశిలోకి (Mercury transit in Libra 2022) ప్రవేశించనున్నాడు. దీని సంచారం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మెర్య్కూరీ సంచారం ఈ 3 రాశులకు శుభప్రదం
1. కన్యారాశి (Virgo) - తులారాశిలో బుధుని సంచారం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. దీంతో వీరు ధనలాభాన్ని పొందనున్నారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు భారీ లాభాలను గడించనున్నారు. 
2. ధనుస్సు (Sagittarius)- బుధుడు రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 
3. కుంభం (Aquarius)- కుంభ రాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.  కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ధనలాభం పొందుతారు. పెట్టుబడికి ఇదే అనుకూలమైన సమయం. ఏదైనా వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also Read: Shukra Gochar 2022: రేపే తులరాశిలోకి శుక్రుడి ప్రవేశం.... ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More