Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Margi 2023: ఈరోజు నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

Mercury transit 2023: ఇవాళ బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈరోజు నుంచి మెర్క్యూరీ ప్రత్యక్ష కదలిక మెుదలుకానుంది. మేషరాశిలో బుధుడి సంచారం వల్ల 5 రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
 

Budh Margi 2023:  ఈరోజు నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

Budh Margi 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. బుద్ధి, తెలివితేటలు  మరియు వ్యాపారానికి కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు బుధుడు మేషరాశిలో నేరుగా నడవనున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ ప్రత్యక్ష కదలిక కారణంగా రేపటి నుండి 5 రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

కన్య రాశి
బుధుడి నేరుగా నడవడం వల్ల కన్యా రాశి వారు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ దక్కుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారు వ్యాపారంలో ఊహించని లాభాలను పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.  ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ బాస్ మీ పనిని మెచ్చుకుంటాడు. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
మిథున రాశి
ఈరాశి యెుక్క 11వ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. దీంతో మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Shadashtak Yog 2023: శని-అంగారకుల షడష్టక యోగం.. ఈ 4 రాశుల జీవితం అల్లకల్లోలం..

సింహరాశి 
సింహరాశి వారి జాతకంలోని 9వ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. మేషరాశిలో బుధుడు గోచారం వల్ల ఈరాశి వారు చాలా ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. విదేశాల్లో వచ్చే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
కర్కాటక రాశి
మెర్క్యూరీ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. జాబ్ ఛేంజ్ అవ్వడానికి ఇదే అనుకూల సమయం.

Also Read: Navapancham Raja Yoga: రాబోయే కొన్ని రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More