Home> ఆధ్యాత్మికం
Advertisement

Grah Gochar 2023: కుజుడు, బుధుడు గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశుల అదృష్టం మారడం ఖాయం..

Grah Gochar in January 2023:  ఒకే రోజున రెండు గ్రహాల స్థానంలో పెను మార్పు రానుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 
 

Grah Gochar 2023: కుజుడు, బుధుడు గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశుల అదృష్టం మారడం ఖాయం..

Grah Gochar 2023: జనవరి నెల మధ్యలో కొన్ని గ్రహాల గమనంలో మార్పు రానుంది. ఇందులో గ్రహాల యువరాజు బుధుడు, గ్రహాల కమాండర్ కుజుడు ఉన్నారు. ఈ రెండు గ్రహాల స్థానం మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జనవరి 13న మధ్యాహ్నం 12.07 గంటలకు అంగారకుడు వృషభరాశిలో ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. అదేరోజు మార్నింగ్ 5.15 గంటలకు ధనుస్సు రాశిలో బుధుడు ధనుస్సు రాశిలో ఉదయిస్తాడు. ఒకే రోజున రెండు గ్రహాల స్థానంలో మార్పు కొందరికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

మేషరాశి (Aries): కుజుడి మార్గి మరియు బుధుడు ఉదయిం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు వివాదాల నుండి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. భారీగా డబ్బు సంపాదిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాధులు దూరమవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer): ఈ రెండు గ్రహాల స్థానాల మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలననే కోరిక నెరవేరుతుంది. 

సింహరాశి (Leo): సింహ రాశి వారికి కుజుడు మరియు బుధ గ్రహాల సపోర్టు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్ మొదలైనవాటితో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఆఫీసులో సహోద్యోగులు మద్దతు లభిస్తుంది. ఫ్యామిలీతో అద్భుత సమయం గడుపుతారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. 

Also Read: Shani Asta 2023: కుంభరాశిలో అస్తమించనున్న శనిదేవుడు ... వీరికి భారీగా డబ్బు నష్టం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More