Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Transit 2023: మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశం... ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Sun Transit 2023: గ్రహాల రాజు సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండి కొందరి అదృష్టం రాకెట్ లా దూసుకుపోతుంది. 
 

Sun Transit 2023: మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశం... ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Sun Transit 2023 In Pisces 2023: ప్రతి నెలా కొన్ని ప్రత్యేక గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. మార్చి నెలలో కూడా కొన్ని ముఖ్యమైన గ్రహసంచారాలు జరగబోతున్నాయి. అందులో సూర్య సంచారం ఒకటి.  ఈనెల 15న సూర్యభగవానుడు శనిదేవుడి రాశి అయిన కుంభరాశిని వదిలి బృహస్పతి యెుక్క రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ప్రస్తుతం కుంభంలో సూర్యుడు-శని కూటమి ఏర్పడింది. మార్చి 15న వీరిద్దరి సంయోగం ముగుస్తుంది. సూర్య సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం
వృషభం
మీన రాశిలో సూర్యుని సంచారం వల్ల వృషభరాశి వారు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. మీరు మీ కెరీర్‌లో చాలా విజయాలు పొందుతారు. ఉద్యోగస్తుల జీతంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. వ్యాపారవేత్తలు ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
మిధునరాశి
మిథునరాశి వారికి సూర్యుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
కర్కాటక రాశి
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక కర్కాటక రాశివారికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. పాత పెట్టుబడుల నుండి మీరు బెనిఫిట్స్ పొందుతారు. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో ముందుకు వెళతారు. కొత్త సభ్యుల రాకతో మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

Also Read: Chandra Grahanam 2023: తొలి చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంలో కనిపిస్తుందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More