Home> ఆధ్యాత్మికం
Advertisement

July Planet Transit 2023: జూలై మొదటి వారంలో గ్రహాల గమనం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు

July Grah Gochar 2023: వచ్చే నెల ప్రారంభంలో కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. కుజుడు, శుక్రుడు మరియు బుధుడు స్థానాల్లో పెను మార్పు రానుంది. దీని వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

July Planet Transit 2023: జూలై మొదటి వారంలో గ్రహాల గమనం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు

Mars Venus and Mercury Planets Transit in July 2023 First Week: జూలై మొదటి వారంలో అంతరిక్షంలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మెుదటగా గ్రహాల అధిపతి అంగారకుడు జూలై 01న సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అనంతరం అదే నెల 07వ తారీఖున ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత రోజే అంటే జూలై 08న బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. జూలై మొదటి వారంలో జరిగే గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

గ్రహాల సంచారం ఈ రాశులకు వరం

మిథున రాశి
జూలై మొదటి వారం మిథునరాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆఫీసులో మీ సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ సర్కిల్ పెరగుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. 

సింహ రాశి
గ్రహాల సంచారం వీరికి కలిసి వస్తుంది. మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని  గడుపుతారు. మీ సామాజిక స్థాయి పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. సృజనాత్మక, క్రీడారంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

Also Read: Ketu Gochar 2023: కన్యా రాశిలోకి వెళ్లనున్న కేతువు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

మేషరాశి
గ్రహాల రాశి మార్పు మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. మీలో ధైర్యసాహసాలు పెరుగుతాయి. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీరు మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కష్టాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. 

Also Read: Jupiter transit 2023: వచ్చే 156 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More