Home> ఆధ్యాత్మికం
Advertisement

Astrology: నెలాఖరులో గ్రహాల సంయోగం.. ఈ 4 రాశులకు వద్దన్నా డబ్బే డబ్బు..

Shukra Gochar: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడు, అంగారకుడు కలయిక జరగబోతుంది. వీరిద్దరి సంయోగం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Astrology: నెలాఖరులో గ్రహాల సంయోగం.. ఈ 4 రాశులకు వద్దన్నా డబ్బే డబ్బు..

Mars venus Conjunction 2023: ప్రస్తుతం అంగారకుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మరోవైపు ఈ నెల 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి : శుక్రుడు కుజుడు కలయిక వల్ల మీకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ వస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ కెరీర్ లో ఊహించని స్థాయికి వెళతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. 
కన్య రాశి : శుక్రుడి సంచారం కన్యారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరతాయి. దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. మీ పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మేషరాశి : శుక్రుడు-అంగారకుడు కలయిక మేషరాశి వారికి కలిసి రానుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందనున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. బిజినెస్ లో ఊహించని పురోగతి సాధిస్తారు. 
మిథున రాశి : మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. 

Also Read: Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More