Home> ఆధ్యాత్మికం
Advertisement

March Shani Blessing Zodiac: ఈ రాశులవారికి అదృష్టం చుట్టు ముట్టబోతోంది! మార్చిలో తిరుగు ఉండదు..

March Shani Blessing Zodiac: కుంభరాశిలో శని కదలిక కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. ఏయే రాశులవారికి ఈ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి.

March Shani Blessing Zodiac: ఈ రాశులవారికి అదృష్టం చుట్టు ముట్టబోతోంది! మార్చిలో తిరుగు ఉండదు..

 

March Shani Blessing Zodiac: జాతకంలో గ్రహాల స్థానాలు బాగుంటేనే వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా జాతకాల్లో శని శుభ స్థానంలో ఉంటే ఆనందం, డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..ఫిబ్రవరి 11 కుంభరాశిలో శని కదలికలు జరిపాడు. అయితే దీని ప్రభావం దాదాపు 36 రోజుల పాటు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని కదలిక కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులా రాశి:
కుంభ రాశిలో శనిగ్రహం కదలిక కారణంగా తులా రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సంపదనాలు ఊహించని మార్పులు వచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయ. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. కెరీర్‌లో కూడా అనేక రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు. 

వృషభ రాశి:
శని ప్రభావం వృషభ రాశివారిపై కూడా పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతి ఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆర్థికంగా కూడా అనేక రకాల లాభాలు పొందుతారు. ఇంతక ముందు ఇతరలకు అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా విద్య సంబంధించిన పనుల్లో కూడా లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో కూడా సానుకూల ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు.

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More