Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangala Gauri Vratam 2022: శ్రావణ మాసం ఎప్పట్నించి, మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు, ఏం చేయాలి, పూజా విధానాలు

Mangala Gauri Vratam 2022: హిందూమతంలో శ్రావణమాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివుడితో పాటు పార్వతిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ మంగళవారం రోజు పార్వతీ దేవి పూజ చేస్తారు.
 

Mangala Gauri Vratam 2022: శ్రావణ మాసం ఎప్పట్నించి, మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు, ఏం చేయాలి, పూజా విధానాలు

Mangala Gauri Vratam 2022: హిందూమతంలో శ్రావణమాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివుడితో పాటు పార్వతిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ మంగళవారం రోజు పార్వతీ దేవి పూజ చేస్తారు.

శ్రావణమాసంలో మంగళవారం నాడు గౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున పార్వతీ దేవిని పూర్తి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. పెళ్లికావల్సిన అమ్మాయిలు, పెళ్లైన అమ్మాయిలు పార్వతీ దేవికి ప్రార్ధనలు చేస్తారు. వ్రతం ఆచరిస్తారు. పెళ్లికావల్సిన అమ్మాయిలు ఈ రోజు వ్రతం ఆచరించడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని నమ్మకం. అటు పెళ్లైన అమ్మాయిలు ఈ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితమంతా సుఖంగా ఉంటుంది. ఇంట్లో కూడా సుఖ శాంతులుంటాయి. మంగళ గౌరి వ్రతం ఎప్పుడు ఎలా చేయాలి, ప్రయోజనాలేంటో చూద్దాం..

శ్రావణమాసం ప్రతి మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతం ఉంటారు. శ్రావణ మాసం జూలై 14 నుంచి ప్రారంభమై..ఆగస్టు 11 వరకూ ఉంటుంది. ఈలోగా తొలి మంగళ గౌరివ్రతం జూలై 19న వస్తుంది. ఈ వ్రతం సిద్ధ యోగం నుంచి ప్రారంభమై..భౌమ ప్రదోషం వరకూ ఉంటుంది. అటు రెండవ గౌరీవ్రతం జూలై 26న శివారాత్రి శుభయోగంలో ఉంటుంది. మూడవ గౌరీవ్రతం ఆగస్టు 2న ఉంది. నాలుగవది చివరి గౌరీవ్రతం ఆగస్టు 9వ తేదీన ఉంటుంది. 

శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం ఉండేందుకు ఉదయమే స్నానం ముగించుకుని మహిళలు వ్రత సంకల్పం చేస్తారు. ఆ తరువాత శుభ్రమైన ప్రదేశంలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి..అలంకరిస్తారు. దీనిపై పార్వతీ దేవి విగ్రహం లేదా ఫోటో ప్రతిష్టిస్తారు. ఆ తరువాత కుంకుమ, గంధం, బియ్యం, ఎర్రపూలు, ధూపం, దీపం, నైవేద్యం వంటివి పార్వతీ దేవికి సమర్పిస్తారు. దాంతోపాటు పార్వతీ దేవికి శృంగార వస్తువులు సమర్పిస్తారు. ఆ తరువాత పార్వతీ దేవికి హారతి ఇచ్చే కార్యక్రమముంటుంది. మొత్తం రోజంతా వ్రతముండి..ఉపవాసముంటారు. సాయంత్రం వేళ వ్రతాన్ని విడుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో వ్రతం ఉండటం వల్ల పార్వతీ దేవి ప్రసన్నమై..భక్తుల కోర్కెలు నెరవేరుస్తుంది. 

పెళ్లి కావల్సిన అమ్మాయిలు వ్రతం ఉండటం వల్ల మంచి వరుడు లభిస్తాడని ప్రతీతి. అటు పెళ్లైన అమ్మాయిలు ఈ మంగళ గౌరీవ్రతం ఉండటం వల్ల అంతులేని సౌభాగ్యం, సుఖమైన దాంపత్య జీవితం, కుటుంబ సంతోషం లభిస్తాయి.

Also read: Som Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More