Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangal Gochar 2023: మరో వారంలో మిథునంలోకి కుజుడు.. దశ తిరగనున్న రాశులివే..!

Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని శుభగ్రహంగా భావిస్తారు. మరో వారం రోజుల్లో మంగళదేవుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఈ సంచారం కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
 

Mangal Gochar 2023: మరో వారంలో మిథునంలోకి కుజుడు.. దశ తిరగనున్న రాశులివే..!

Mangal Gochar 2023: గ్రహాల కమాండరైన మంగళదేవుడు మార్చి 13న రాశిని మార్చబోతున్నాడు. ఈ రోజున కుజుడు వృషభరాశిని వదిలి మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. మేషం మరియు వృశ్చికరాశికి అంగారకుడిని అధిపతిగా భావిస్తారు. కుజుడు మకరరాశిలో ఉచ్ఛస్థితిలోనూ, కర్కాటక రాశిలో బలహీనస్థితిలోనూ ఉంటాడు. మిథునరాశిలో కుజుడి ప్రవేశం వల్ల కొందరికి మంచి రోజులు మెుదలవుతాయి. కుజుడు రాశి మారడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. 

కుజుడి సంచారం ఈరాశులకు వరం
మేషరాశి
అంగారకుడు మీ రాశి యెుక్క మూడవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు మీకు లభిస్తుంది. ఆఫీసులో మీ పాపులారిటీ పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మేషరాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
మిధునరాశి
ఈ రాశిలో కుజుడు సంచారం జరగబోతుంది. ఫలితంగా మీలో ధైర్యం పెరుగుతుంది. మీలో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
వృశ్చికరాశి
మంగళదేవుడు మీ రాశి యెుక్క ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు రాశి 
మీ ఆరవ ఇంటి గుండా కుజుడు సంచరిస్తున్నాడు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు రుణవిముక్తి నుండి బయటపడతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది. 

Also Read: బృహస్పతి రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు.. ఈరాశులకు ఊహించని సంపద..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More