Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangal Gochar Effects: కుజుడు రాశి సంచారం.. జూన్‌ 1వ తేది నుంచి ఈ 4 రాశులవారికి ధనమే, ధనం!


1st June Mangal Gochar In Telugu: జూన్‌ 1వ తేదిన కుజుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అలాగే సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది.

Mangal Gochar Effects: కుజుడు రాశి సంచారం.. జూన్‌ 1వ తేది నుంచి ఈ 4 రాశులవారికి ధనమే, ధనం!

1st June Mangal Gochar In Telugu: తొమ్మిది గ్రహాలలో అంగార గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని మేష రాశితో పాటు వృశ్చిక రాశులకి అధిపతిగా చెప్పుకుంటారు. ఈ గ్రహాన్ని  భూమి, ధైర్యం, శౌర్యానికి సూచికగా కూడా పరిగణిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి. అయితే ఈ గ్రహం జూన్‌ 1వ తేదిన 3.51 గంటలకు సంచారం చేయబోతోంది. జూలై 12 వరకు ఈ గ్రహం అదే రాశిలో సంచారం క్రమంలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశువారికి బంపర్‌ బెనిఫిట్స్‌ లభిస్తున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా పూర్తిగా మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

ధనుస్సు  రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ సంచారం జాతక చక్రంలో ఐదవ స్థానంలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా వీరికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.  అలాగే వివాహాలు కనివారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరు శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరిగి అనేక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విద్యార్థులకు ఈ కాలం చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఉన్నత విద్యా కోసం విదేశాలు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

మేష రాశి:
కుజుడు సంచారంతో మేష రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ధైర్యం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి జీతాలు పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా కొత్త కార్లతో పాటు భూములు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారిక పదోన్నతులు కూడా లభిస్తాయి. కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు వస్తాయి. 

సింహ రాశి:
సింహ రాశివారికి ఈ గ్రహ సంచారంతో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా పాత పెట్టుబడుల్లో పెట్టిన డబ్బులు సులభంగా తిరిగి వస్తాయి. అలాగే వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే అదృష్టం కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి బాధ్యతలు పెరిగి, ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వీరు కొంత కష్టపడి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వీరికి ప్రసంసలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా అనేక మార్పులు వస్తాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మిథునరాశి:
మిథునరాశి వారికి కూడా ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి సంపదన కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా పెరుగుతాయి. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేవారికి ఈ సమయం చాలా అదృష్టకరంగా ఉంటుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More