Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangal Gochar 2023: రాబోయే 45 రోజులపాటు ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం.. మీరున్నారా?

Mars transit 2023: గ్రహాల అధిపతి కుజుడు ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడి రాశిలో అంగారకుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Mangal Gochar 2023: రాబోయే 45 రోజులపాటు ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం.. మీరున్నారా?

Mangal Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ఇతడిని శౌర్యం, భూమి మరియు వివాహానికి కారకుడిగా భావిస్తారు. జూలై 01న కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 18 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. కుజుడు సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 

తుల: కుజుడు సంచారం తులరాశి వారికి భారీగా ధనాన్ని ఇస్తుంది. ఆఫీసులో ఈసమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ప్రమోషన్ లభిస్తుంది. మీ జీతం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 

మిథునరాశి : మిథునరాశి వారికి అంగారక సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

సింహ రాశి: ఇదే రాశిలో అంగారకుడి సంచారం జరిగింది. దీంతో మీరు వ్యాపార, ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. మీ పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. మీ కెరీర్ కీలక మలుపులు తిరుగుతుంది. 

Also Read: Shani Vakri 2023: రివర్స్ లో కదులుతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..!

ధనుస్సు: కుజుడు సంచారం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. మీ పురోగతికి మార్గం తెరవబడుతుంది. కొత్త ఉద్యోగం సాధిస్తారు. విదేశాల్లో బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  RajYog 2023: అరుదైన యోగం చేస్తున్న కుజుడు-గురుడు.. ఈ 4 రాశులవారి సుడి తిరగడం పక్కా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More