Home> ఆధ్యాత్మికం
Advertisement

Mars transit 2023: మే 10న కుజుడు-బుధుడు గమనంలో పెను మార్పు... ఈరాశులకు ఊహించనంత డబ్బు..

Grah Gochar 2023:  మరో నాలుగు రోజుల్లో బుధుడు, అంగారక గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 
 

Mars transit 2023: మే 10న కుజుడు-బుధుడు గమనంలో పెను మార్పు... ఈరాశులకు ఊహించనంత డబ్బు..

Mangal Gochar 2023 and Budh Uday 2023: కళ్యాణ దేవుడు అయిన అంగారకుడు ఈ నెల 10న బుధుడి ఆధీనంలో ఉన్న మిథునరాశి నుండి బయటకు వెళ్లి చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 01 వరకు అతడు అక్కడే ఉంటాడు. అనంతరం మంగళదేవుడు సూర్యుడికి చెందిన సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. మరోవైపు గ్రహాల రాకుమారుడుగా పిలువబడే బుధుడు కూడా మే 10న మేషరాశిలో ఉదయించబోతున్నాడు. ఈ రెండు పెద్ద గ్రహాల సంచారం మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం కారణంగా నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

వృషభం
అంగారకుడి సంచారం కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. 
సింహరాశి 
అంగారక గ్రహ సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. మీరు పని నిమిత్తం బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో యోగా చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.
కన్య రాశి
అంగారకుడు మరియు బుధ గ్రహాల సంచారం మీరు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ మరియు వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. మీరు మిత్రులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. 
కుంభ రాశి
మెర్క్యురీ గ్రహం ఉదయం కారణంగా ఆఫీసులో మీ పనితీరుక ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి కానీ మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 

Also Read: Shani Gochar 2023: శని తిరోగమనంతో ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా... మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More