Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangal Surya Gochar: రాశిని మార్చబోతున్న అంగారకుడు-సూర్యుడు.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..

Mangal gochar: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు మరియు కుజుడు తమ రాశిని మార్చబోతున్నారు. దీంతో 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
 

Mangal Surya Gochar: రాశిని మార్చబోతున్న అంగారకుడు-సూర్యుడు.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..

Surya And Mangal Rashi Parivartan:  ఈ రెండు మూడు రోజుల్లో సూర్యుడు, కుజుడు తమ రాశులను మార్చనున్నారు. మార్చి 13న కుజుడు, మార్చి 15న సూర్యభగవానుడు గమనంలో పెను మార్పు రానుంది. అంగారకుడు మిథునరాశిలోకి, సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నారు. వీరిద్దరి రాశి మార్పు మూడు రాశులవారికి పురోభివృద్ధితోపాటు భారీగా ధనాన్ని ఆర్జిస్తారు. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.

వృషభ రాశి
అంగారకుడు మరియు సూర్య భగవానుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి 11వ ఇంట్లోనూ, కుజుడు లగ్న గృహంలోనూ సంచరించనున్నారు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే బలపడుతుంది. మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలు పెట్టుబడి పెట్టేవారు మీరు ప్రయోజనం పొందుతారు. 
మిథున రాశిచక్రం
కుజుడు మరియు సూర్య భగవానుడి రాశి మార్పు వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 12వ ఇంట్లో కుజుడు, పదో ఇంట్లో సూర్యభగవానుడు సంచరించనున్నారు. మీరు పని లేదా వ్యాపారంలో విజయం సాధిస్తారు. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 
వృశ్చిక రాశిచక్రం
సూర్యుడు మరియు అంగారక గ్రహాల సంచారం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో కుజుడు మరియు ఐదవ ఇంట్లో సూర్య దేవుడు ఉండబోతున్నాడు. దీంతో దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనిలో మీకు విజయం దక్కుతుంది. మీ ఆదాయా రెట్టింపు అవుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

Also Read: Surya Dev: మరో 4 రోజుల్లో సూర్య-శని కూటమి అంతం.. ఈరాశులకు విపరీతమైన ప్రయోజనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More