Home> ఆధ్యాత్మికం
Advertisement

Maha Shivratri: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ ఉత్సవమో తెలుసా?

Maha Shivratri Brahmotsavam: పరమపవిత్రమైన మహా శివరాత్రికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మార్మోగనుంది.

Maha Shivratri: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ ఉత్సవమో తెలుసా?

SriSailam Brahmotsavam: హిందూవులకు అతి ముఖ్యమైన పర్వదినం మహా శివరాత్రి. పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రికి శైవ క్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. మార్చి 8వ తేదీ మహా శివరాత్రి వస్తుండడంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగనున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే జ్యోతిర్లింగమైన శ్రీశైలంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగనున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతియేటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పాలకమండలి భారీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు ప్రకటించారు.

Also Read: Medaram Jathara 2024: భక్త జనసంద్రంగా మేడారం.. మహా జాతర ఫొటో గ్యాలరీ

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శైవ భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం ఆలయ చైర్మన్‌ చక్రపాణి రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

Also Read: Medaram: సమ్మక్క సారక్క జాతరలో పోలీస్‌ అత్యుత్సాహం.. భార్యాభర్తలపై చేయి చేసుకున్న వైనం

బ్రహ్మోత్సవాల్లో జరిగే ప్రత్యేక పూజా కార్య్రమాలు, వాహన సేవలు, పట్టువస్త్రాల సమర్పణ, దర్శనం వంటి తదితర అంశాలపై చైర్మన్‌ పాలక మండలితో చర్చించారు. అదనపు క్యూలైన్లు, వసతి, తాగునీరు, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్య పనులు తదితర వాటిపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు

మార్చి 1వ తేదీః ధ్వజారోహణం, శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారుల పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 2: భృంగీ వాహన సేవ
మార్చి 3: హంస వాహన సేవ. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 4:  మయూర వాహన సేవ. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 5: రావణ వాహన సేవ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 6: పుష్ప పల్లకీ సేవ
మార్చి 7: గజ వాహన సేవ
మార్చి 8: మహాశివరాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం.
మార్చి 9: రథోత్సవం, తెప్పోత్సవం
మార్చి 10: ధ్వజావరోహణం
మార్చి 11: అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More