Home> ఆధ్యాత్మికం
Advertisement

Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు 

Maha Shivratri 2021 Date: శివుడు, జగన్మాత పార్వతి వివాహం జరిగిన రోజు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు 

Maha Shivratri 2021 Date And Time: మహా శివరాత్రి.. హిందువులు, అందులోనూ శైవ భక్తులకు అతి పవిత్రమైన పర్వదినం ఇది. శివుడుని భక్తితో కొలుస్తూ జరుపుకుంటారు. శివుడు, జగన్మాత పార్వతి వివాహం జరిగిన రోజు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

ఈ ఏడాది మార్చి 11న మహాశివరాత్రి పండుగ(Maha Shivaratri 2021)ను జరుపుకోనున్నాం. బిల్వ పత్రం శివుడికి చాలా ప్రియమైనది. ఆరోజు పరమశివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాధులను దూరం చేస్తుందని సైతం భక్తులు విశ్విసిస్తారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. 

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 26, 2021 Rasi Phalalu, వారికి ఉద్యోగం

శివ పురాణం ప్రకారం, శివలింగం శివుని వ్యక్తిత్వం లేని రూపంగా పరిగణిస్తారు. కనుక మహా శివరాత్రి(Happy Shivaratri 2021) సందర్భంగా మాత్రమే కాకుండా, ప్రతిరోజు శివలింగాన్ని నీటితో అభిషేకం చేయవచ్చు. తద్వారా మిమ్మల్ని అదృష్టం వరించనుంది. శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా శారీరక మరియు మానసిక సమస్యలు దూరం అవుతాయి.  అంతేకాక, శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతారు.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

భగవంతుడికి ఎంతో ఆనందాన్నిచ్చే మరో విషయం బియ్యం. మహాశివరాత్రి నాడు శివుడికి భక్తితో బియ్యం సమర్పించాలి. శివ పురాణాల ప్రకారం, శివుడికి అన్నపూర్ణ స్వరూపమైన బియ్యం సమర్పించడం ద్వారా శివుడు సంతోషించి మీకు అన్ని శుభాలు కలుగజేస్తాడని నమ్మకం. సంపదను, ఆరోగ్యాన్ని సైతం అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం

మహాశివరాత్రి రోజు, భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఓం నమ శివాయ స్తోత్రం, మంత్రాలను పఠించాలి. శివుడు శివతాండవం చేసినరోజు మహా శివరాత్రి రోజున రాత్రి జరుపుకుంటారని కొన్ని పురాణాగాథలు పేర్కొన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More