Home> ఆధ్యాత్మికం
Advertisement

Lucky Weekly Zodiac Signs: ఫిబ్రవరి రెండవ వారం ఊహించని లాభాలు పొందే రాశులవారు వీరే..


Lucky Weekly Zodiac Signs 5Th-11Th February:  ఫిబ్రవరి రెండవ వారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే, మరి కొన్ని రాశులవారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి తీవ్ర అనారోగ్య మసస్యలు వస్తాయి. 

Lucky Weekly Zodiac Signs: ఫిబ్రవరి రెండవ వారం ఊహించని లాభాలు పొందే రాశులవారు వీరే..

 

Lucky Weekly Zodiac Signs 5Th-11Th February: త్వరలోనే ఫిబ్రవరి రెండవ వారం ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి సంతోషం పెరిగితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫిబ్రవరి రెండవ వారంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో? అదృష్ట రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
ఉద్యోగాలు చేస్తున్నవారు సీనియర్స్‌తో మాట్లాడే ఛాన్స్‌ ఉంది. దీని కారణంగా కొన్ని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు ఈ వారం ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పనులు, బాధ్యతలు చేపట్టినా గొప్ప విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పిల్లల నుంచి తల్లిదండ్రులకు కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

వృషభ రాశి:
ఈ ఫిబ్రవరి రెండవ వారం కూడా వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో మీ  సహోద్యోగులు ఎంతో కలసి మెలసిగా ఉంటారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు అతిగా ఖర్చులు పెట్టడం చాలా మంచిది. దీంతో పాటు రోజువారి ఖర్చులు కూడా తగ్గించుకోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్య పరంగా దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి చర్మ సమస్యలు సమస్యలు కూడా వస్తాయి. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా వ్యాపారాల్లో ఊహించని ఇబ్బందులు రావొచ్చు. దీంతో పాటు ప్రేమ జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ వారం వీరు అనేక అనారోగ్య సమస్యల బారిన పడతారు. అలాగే పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ వారం కొత్త విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి బాస్‌ల నుంచి ప్రశంసలు అందుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో ఒత్తిడితో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో చిన్న సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వాటికి దూరంగా వెళ్లకుండా ఎదుర్కోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి రెండవ వారం చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో డబ్బులు కూడా చాలా వరకు పొదుపు చేస్తారు. వ్యాపారస్తుల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి ఆఫీసుల నుంచి ఆఫర్స్‌ పొందుతారు. 

తులారాశి:
తులారాశి వారు ఈ సమయంలో క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో భయపడకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబ జీవితం గడుపుతున్నవారికి కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More