Home> ఆధ్యాత్మికం
Advertisement

How to Get Good Luck: ఇలాంటి పనులు చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వెంట పడుతుందట

Remedies to Get Good Luck: తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే పనిలో భాగంగా తమ వంతుగా వీలైనంత ఎక్కువగా కృషి చేయడమే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉండాలనేది పెద్దల మాట. అందుకే పండితులు చెబుతున్న వివరాల ప్రకారం దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Get Good Luck: ఇలాంటి పనులు చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వెంట పడుతుందట

Remedies to Get Good Luck: కొత్త సంవత్సరం 2023 ప్రారంభమై అప్పుడే సగం నెల గడిచింది. గతేడాది అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, చేయాలనుకుని పూర్తి చేయలేకపోయిన పనులు ఈ ఏడాది పూర్తి చేయాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే పనిలో భాగంగా తమ వంతుగా వీలైనంత ఎక్కువగా కృషి చేయడమే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉండాలనేది పెద్దల మాట. అందుకే పండితులు చెబుతున్న వివరాల ప్రకారం దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కలను నాటితే ఏం జరుగుతుందో తెలుసా ?
మీ లక్ష్యాలు నెరవేరాలంటే మీరు కష్టపడి పనిచేయడంతో పాటు మొక్కలను నాటి వాటికి ప్రాణం పోయండి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక వేప చెట్టు, ఒక రావి చెట్టు, 3 ఎలక్కాయ చెట్లు, 3 ఉసిరి చెట్లు, 5 మామిడి చెట్లు, 10 చింతపండు చెట్లను నాటిన వ్యక్తికి పుణ్యం లభించడంతో పాటు పాప విముక్తడై కష్టాల బారి నుంచి బయటపడతాడని ప్రతీతి. అలా సంవత్సరానికి రెండుసార్లు చెట్లు నాటడం ద్వారా మంచి జరుగుతుందనేది బలమైన విశ్వాసం.

దుప్పట్లు దానం చేయండి
శీతాకాలంలో బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం పొందే నిరాశ్రయులు ఎముకలు కొరికే చలితో ఎంతో బాధపడుతుంటారు. వారిని ఆ ఇబ్బంది నుంచి దూరం చేస్తూ అవసరమైన వారికి దుప్పట్లు దానం చేయడం పుణ్య కార్యం అనిపించుకుంటుంది. ఎవరైనా పేదవారికి లేదా దేవాలయంలో ఆశ్రయం పొందే వారికి మీ చేతితో దుప్పటిని విరాళంగా ఇస్తే మంచి జరుగుతుంది. తెలుపు, నలుపు రంగులు కలిసిన దుప్పట్లు దానంగా ఇస్తే మరీ మంచిదట. వీలైతే శనివారం నాడు ఇలాంటి దానాలు చేయడం ద్వారా రాహు-కేతు దోషాలు తొలగిపోయి ఇంకా మంచి జరుగుతుంది అని గ్రంధాలు చెబుతున్నాయి. 

హనుమంతునికి సింధూరం
కష్టాల్లో ఉన్నప్పుడు జై బజరంగ్ బలి అని గుండెల నిండా గాలి పీల్చుకుంటే ఎక్కడా లేని ధైర్యం వస్తుందట. సంవత్సరానికి రెండుసార్లు హనుమంతుడికి ఎరుపు రంగు దుస్తులను సమర్పించి సింధూరం వేయిస్తే ఆ ఆంజనేయ స్వామి ఆశిస్తులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయని నమ్మకం. అంతేకాకుండా ప్రవహించే నీళ్లలో సింధూరం, బత్తీసలు, నువ్వు ఉండలు, తేనె పోయడం ద్వారా మంగళ దోషం తొలగిపోతుంది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తే.. మీ జీవితంలో విజయం మీ వెంటే ఉంటుందట.

వికలాంగులకు, ఆకలితో అలమటించే అన్నార్థులకు అన్నదానం చేయండి
మీరు ఒక సంవత్సరంలో కనీసం 10 మంది దివ్యాంగులు, సన్యాసులు లేదా ఏ తోడు లేని బాల, బాలికలకు అన్నదానం చేయడం ద్వారా పుణ్యం సిద్ధిస్తుంది. ఇది సాధ్యం కాకపోతే, జంతువులు, పక్షులకు ఆహారం అందించడం, వాటి దప్పిక తీరేలా నీరు ఏర్పాటు చేయడం వంటి పనులు మేలు చేస్తాయి. అందుకే గోశాలలో పశుగ్రాసం దానం చేయడాన్ని పుణ్య కార్యంగా భావిస్తుంటాం. ఇలాంటి అన్నదానాల వల్ల శనిదోషం పోయి అదృష్టం పట్టుకుంటుందట.
    
(గమనిక : ఈ కథనంలో పేర్కొన్న వివరాలు సాధారణ నమ్మకాలు లేదా సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో ఉన్న అంశాలతో ZEE NEWS ఏ విధంగానూ ఏకీభవించడం లేదు).

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్

ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More