Home> ఆధ్యాత్మికం
Advertisement

Karthika Masam 2023: కార్తీక మాసంలో ఈ 3 రాశులకు తిరుగేలేదు, పట్టిందల్లా బంగారమే

Karthika Masam 2023: హిందూమతంలో జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో కొన్ని నెలలకు అంతే మహత్యముంది. ముఖ్యంగా కార్తీక మాసం అన్నింటికంటే ఎక్కువగా పరిగణిస్తారు. కార్తీక మాసం హిందూ కేలండర్ ప్రకారం అత్యంత పవిత్రమైంది. పూర్తి వివరాలు ఇలా 
 

Karthika Masam 2023: కార్తీక మాసంలో ఈ 3 రాశులకు తిరుగేలేదు, పట్టిందల్లా బంగారమే

Karthika Masam 2023: హైందవ నమ్మకాల ప్రకారం కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. ఎందుకంటే ఈ నెల శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెలగా చెబుతారు. అందుకే ఈ నెలలో ప్రత్యేక పూజలు, వ్రతాలు, నదీ స్నానాలు ఇలా చాలా ఉంటాయి అక్టోబర్ 29 నుంచి కార్తీక మాసం ప్రారంభమైపోయింది. దీని ప్రభావం ముఖ్యంగా 3 రాశులపై ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు.

కార్తీక మాసం అనేది లక్ష్మీదేవి, విష్ణువులకు అంకితమంటారు. ఈ నెలలో 3 రాశులపై ఊహించని విధంగా లక్ష్మీ నారాయణుల కటాక్షం కలగనుంది. అన్నివైపుల్నించి ధనలాభం కలుగుుతుంది. కార్తీక మాసంలో తులసి పూజలు విశేష ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ నెలలో కీలకమైన గ్రహాల గోచారం ఉండటం వల్ల మరింత ప్రాముఖ్యత పెరిగింది. నవంబర్ 3వ తేదీన శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం శుక్రగ్రహాన్ని ధనానికి కారకుడిగా భావిస్తారు. అందుకే శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం చాలా రాశుల జీవితాల్లో కనకవర్షం కురిపిస్తుంది. శుక్రుడి రాశి పరివర్తనంతో కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

శుక్రుడి రాశి పరివర్తనం కారణంగా మిధున రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీ నారాయణుల కటాక్షం కారణంగా ధన సంపదలు వచ్చి పడతాయి. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లాభిస్తే..వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రుణ విముక్తులౌతారు. ఇంట్లో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.

కార్తీకంలో శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో వృశ్చిక రాశి జాతకులపై సానుకూల పరిణామాలుంటాయి. ఈ రాశి జాతకులకు ఆకశ్మిక ధనలాభం కలగడం వల్ల ఆర్ధికంగా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఉద్యోగం చేసేచోట తరచూ ఎదురయ్యే సమస్యలు దూరమౌతాయి. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అమితమైన లాభాలుంటాయి. పెట్టుబడులకు అత్యంత అనువైన సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

కార్తీక మాసంలో శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో మేష రాశి జాతకులకు మహర్దశ పట్టనుంది. లక్ష్మీదేవి, విష్ణువు కటాక్షం ఉండటంతో అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపారంలో అంతులేని వృద్ధి కన్పిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అంటే ఏ వ్యాపారం చేసినా వృద్ధి ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. 

Also read: Budh Gochar 2023: బుధుడి సంచారంతో దీపావళికి ముందే ఈ రాశులవారికి పండగ స్టార్ట్‌..లాభాలే, లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More